Telugu Global
NEWS

మూసాను ప్రశ్నిస్తున్న యాంటీడ్రగ్స్‌ అధికారులు

మాదక ద్రవ్యాల ప్యాకెట్లను శరీరంలో దాచుకొని దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన మూసా కడుపులో నుండి సుమారు కోటి రూపాయల విలువగల 51 ప్యాకెట్ల మాదక ద్రవ్యాలను వెలికి తీశారు. ఉస్మానియా వైద్యులు సురక్షితంగా ఈ మాదక ద్రవ్యాలు బయటకు తీసిన తరువాత మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. మాదక ద్రవ్య నిరోధక శాఖా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాకు […]

మూసాను ప్రశ్నిస్తున్న యాంటీడ్రగ్స్‌ అధికారులు
X
మాదక ద్రవ్యాల ప్యాకెట్లను శరీరంలో దాచుకొని దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చి శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన మూసా కడుపులో నుండి సుమారు కోటి రూపాయల విలువగల 51 ప్యాకెట్ల మాదక ద్రవ్యాలను వెలికి తీశారు. ఉస్మానియా వైద్యులు సురక్షితంగా ఈ మాదక ద్రవ్యాలు బయటకు తీసిన తరువాత మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. మాదక ద్రవ్య నిరోధక శాఖా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అసలు మాదకద్రవ్యాలు ఎక్కడ నుంచి తీసుకొస్తుందో… ఎవరికి ఇవి చేరవేస్తుందో తెలుసుకుంటే మొత్తం గుట్టు రట్టవుతుందని పోలీసులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని కొందరు ప్రముఖులతోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాదక ద్రవ్యాల వాడకంలోను, విక్రయంలోను ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు ఇంతకుముందే అనేకసార్లు ఆధారాలతో సహా బయటపడింది. ఇపుడు మూసా ఇచ్చే సమాచారంతో గతంలో సేకరించిన వివరాలు ముడిపడితే మాదకద్రవ్యాల విక్రయం, వాడకంలో పాత్రధారులు, సూత్రధారులు బయటపడతారని భావిస్తున్నారు. మూసా ఇవ్వబోయే సమాచారం వల్ల సినీ పరిశ్రమకు ఎక్కడ దెబ్బతగులుతుందోనని ఫిలింనగర్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
First Published:  2 Sep 2015 4:21 AM GMT
Next Story