Telugu Global
NEWS

అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని ఆమ్మేయండి: హైకోర్టు

అగ్రిగోల్డ్‌ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది మందిని మోసగించిన అగ్రిగోల్డ్‌ సంస్థపై కోర్టుకు నమ్మకం లేదని వ్యాఖ్యానించింది. బాధితులందరికీ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వమే కీలక భూమిక పోషించాలని ఆదేశించింది. సంస్థకు చెందిన 14 ఆస్తుల్ని ముందుగా విక్రయించాలని, ఒకవేళ చెల్లింపులకు ఆ మొత్తం సరిపోకపోతే మిగిలిన 154 ఆస్తుల విక్రయానికి పూనుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఓ ప్రత్యేక ఏజన్సీని నియమించాలని, ఆస్తుల విక్రయం మొత్తం వ్యవహారం దాని ద్వారానే […]

అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని ఆమ్మేయండి: హైకోర్టు
X
అగ్రిగోల్డ్‌ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది మందిని మోసగించిన అగ్రిగోల్డ్‌ సంస్థపై కోర్టుకు నమ్మకం లేదని వ్యాఖ్యానించింది. బాధితులందరికీ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వమే కీలక భూమిక పోషించాలని ఆదేశించింది. సంస్థకు చెందిన 14 ఆస్తుల్ని ముందుగా విక్రయించాలని, ఒకవేళ చెల్లింపులకు ఆ మొత్తం సరిపోకపోతే మిగిలిన 154 ఆస్తుల విక్రయానికి పూనుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఓ ప్రత్యేక ఏజన్సీని నియమించాలని, ఆస్తుల విక్రయం మొత్తం వ్యవహారం దాని ద్వారానే జరగాలని స్పష్టం చేసింది. విక్రయం వల్ల వచ్చే ఆదాయాన్ని ముందుగా కోర్టు ఖాతాలో జమ చేసి చెల్లింపులన్నీ అక్కడ నుంచే జరపాలని ఆదేశించింది. ప్రభుత్వం ఈ కేసులో సరిగా వ్యవహరించని పక్షంలో కేసును సీబీఐకి అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించింది. కేసును సోమవారానికి వాయిదా వేస్తూ తదుపరి విచారణకు సీఐడి అధికారి హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు ఇంత స్పష్టంగా ఆదేశాలివ్వడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు బకాయిలు వస్తాయన్న ధీమా కనబరుస్తున్నారు.
First Published:  3 Sep 2015 2:39 AM GMT
Next Story