Telugu Global
Others

బీహార్ ఎన్నికల్లో ‘ఎస్పీ’ఒంటరి పోరు

భార‌తీయ జ‌న‌తాపార్టీ, కాంగ్రెస్ పార్టీల‌కు ధీటుగా త‌యార‌య్యేందుకు ఆరు పార్టీల‌తో కూడిన జ‌న‌తాద‌ళ్ ప‌రివార్ ఒక్క‌టై నాలుగు నెలలన్నా కాక ముందే జనతా పరివార్‌ నుంచి సమాజ్‌వాది పార్టీ బయటికి వచ్చేసింది. ఎస్పీ, ఆర్జేడీ, జేడీయు, జెడీఎస్‌, ఐఎన్ఎల్‌డీ, ఎస్‌జేపీల అధ్య‌క్షులు ఏకమై బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా జట్టుకట్టాయి. బీహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు సభలు, సమావేశాలు, మరోవైపు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీల […]

బీహార్ ఎన్నికల్లో ‘ఎస్పీ’ఒంటరి పోరు
X
భార‌తీయ జ‌న‌తాపార్టీ, కాంగ్రెస్ పార్టీల‌కు ధీటుగా త‌యార‌య్యేందుకు ఆరు పార్టీల‌తో కూడిన జ‌న‌తాద‌ళ్ ప‌రివార్ ఒక్క‌టై నాలుగు నెలలన్నా కాక ముందే జనతా పరివార్‌ నుంచి సమాజ్‌వాది పార్టీ బయటికి వచ్చేసింది. ఎస్పీ, ఆర్జేడీ, జేడీయు, జెడీఎస్‌, ఐఎన్ఎల్‌డీ, ఎస్‌జేపీల అధ్య‌క్షులు ఏకమై బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా జట్టుకట్టాయి. బీహార్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణలు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఓ వైపు సభలు, సమావేశాలు, మరోవైపు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే జేడీయూ – ఆర్జేడీ మహాకూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) తమను చిన్నచూపు చూస్తున్నారంటూ జనతా పరివార్ నుంచి వైదొలగింది. బీహార్ ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిపోరు చేయాలని నిర్ణయించింది. సీట్ల పంపకంపై తమను మహా కూటమి సంప్రదించలేదని ఎస్పీ పేర్కొంది. ఇక ఎస్పీ ఒంటరి పోరు చేయనుంది.
నిజానికి జనతా పరివార్‌ కూటమిలో బీహార్‌కు చెందిన ఆర్జేడీ, జేడీయూ ప్రధాన పార్టీలు విలీనానంతర పరిస్థితులపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరో 4,5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రెండు పార్టీలు పలు దఫాల చర్చల తర్వాత నితీష్‌ కుమార్‌కు, తనకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని లాలూ చెప్పారు. అయితే సీఎం అభ్యర్థిత్వం విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని తెలియవచ్చింది. ఈరెండు పార్టీలు కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని సమాజ్‌వాదిని ఏకాకిని చేయడంతో అలిగిన ములాయం బయటికి వచ్చేసి ఒంటరి పోరుకు తమ పార్టీని సమాయత్తం చేయడానికి సిద్ధపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జేడీయూ, ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఇప్పుడు అధికారంలో ఉన్న జనతాదళ్‌ (యు) వంద స్థానాల్లోను, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్‌ వంద స్థానాల్లోను, కాంగ్రెస్‌ పార్టీ 40 స్థానాల్లోను పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు మూడు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశాయి. భారతీయ జనతాపార్టీని బీహార్‌కు దూరంగా ఉండడం లక్ష్యంగానే ఈ ఎన్నికల ఒప్పందం చేసుకున్నట్లు బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. అయితే పరివార్‌లోని మిగిలిన పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండానే వీరు ఇలా ప్రకటించడం భాగస్వాములకు మంట పుట్టింది. దాంతో ములాయం సర్దుకుని బయటపడ్డారు.
First Published:  3 Sep 2015 3:27 AM GMT
Next Story