Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమా హక్కులు అయిపోయాయ్

స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ దశలో ఉంటుండగానే అమ్ముడుపోతాయి. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదలవ్వడం వెరీ కామన్. ప్రస్తుతం యంగ్ టైగర్ సినిమా కూడా అదే స్టేజ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బిజినెస్ ప్రారంభమైంది. కొన్ని ఏరియాస్ కు సంబంధించి మార్కెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓవర్సీస్ మాత్రం ప్రస్తుతం నిర్మాతల దగ్గరే ఉంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా తాజాగా అమ్మేశారు. జెమినీ ఛానెల్ ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ సినిమా హక్కులు అయిపోయాయ్
X
స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ దశలో ఉంటుండగానే అమ్ముడుపోతాయి. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదలవ్వడం వెరీ కామన్. ప్రస్తుతం యంగ్ టైగర్ సినిమా కూడా అదే స్టేజ్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బిజినెస్ ప్రారంభమైంది. కొన్ని ఏరియాస్ కు సంబంధించి మార్కెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓవర్సీస్ మాత్రం ప్రస్తుతం నిర్మాతల దగ్గరే ఉంది. మరోవైపు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను కూడా తాజాగా అమ్మేశారు. జెమినీ ఛానెల్ ఎన్టీఆర్ సినిమా ప్రసార హక్కుల్ని దక్కించుకుంది. ఇప్పటికే తారక్ నటించిన ఎన్నో హిట్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ఈ ఛానెల్, ఇప్పుడు తాజా చిత్రాన్ని కూడా భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. తాజా డీల్ తో తారక్ సినిమా విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్ లో జగపతిబాబు, ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాల్ని తీస్తారు. ఎన్టీఆర్-రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాల్ని ఇప్పటికే తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్.
First Published:  2 Sep 2015 7:03 PM GMT
Next Story