Telugu Global
National

ప‌రిష్కారం దిశ‌గా ఓఆర్ " ఓపీ!

 వ‌న్ ర్యాంక్‌- ఒకే పెన్షన్‌’(ఓఆర్‌-ఓపీ) వివాదం ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తాజాగా కేంద్రం-మాజీ సైనికులు ఉమ్మ‌డిగా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపే ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఎట్ట‌కేల‌కు ఓఆర్‌ఓపీ అమలు కోసం 80 రోజులుగా ఆందోళన చేస్తున్న సైనికులు ఓ మెట్టు దిగారు. తాము గతంలో ఆశించినట్టుగా పెన్షన్‌ రివిజన్‌ను ఏటా కాకుండా రెండేళ్లకోసారి అంగీకరించేందుకు సిద్ధపడ్డారు. సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు […]

ప‌రిష్కారం దిశ‌గా ఓఆర్  ఓపీ!
X
వ‌న్ ర్యాంక్‌- ఒకే పెన్షన్‌’(ఓఆర్‌-ఓపీ) వివాదం ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. తాజాగా కేంద్రం-మాజీ సైనికులు ఉమ్మ‌డిగా ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపే ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఎట్ట‌కేల‌కు ఓఆర్‌ఓపీ అమలు కోసం 80 రోజులుగా ఆందోళన చేస్తున్న సైనికులు ఓ మెట్టు దిగారు. తాము గతంలో ఆశించినట్టుగా పెన్షన్‌ రివిజన్‌ను ఏటా కాకుండా రెండేళ్లకోసారి అంగీకరించేందుకు సిద్ధపడ్డారు. సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సత్బీర్‌సింగ్ వెల్ల‌డించారు. దీంతో వ‌న్‌ర్యాంక్‌- వ‌న్ పెన్ష‌న్ అమ‌లుపై నెల‌కొన్న ప్ర‌తిష్టంబ‌న త్వ‌ర‌లోనే స‌మ‌సిపోతుంద‌ని మాజీ సైనికులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  3 Sep 2015 12:31 AM GMT
Next Story