Telugu Global
Cinema & Entertainment

పవన్ ను దాటిన మహేష్

విడుద‌లైన మొద‌టి రోజు నుంచి పాజిటివ్ టాక్ గెయిన్ చేసిన చిత్రం శ్రీ‌మంతుడు. అయితే ఈ చిత్రం  క‌లెక్ష‌న్స్ గురించి ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు రాసేసుకున్నారు.మొదటి వారంలోనే  వంద కోట్లు  షేర్ క‌లెక్ట్ చేసిందంటూ  హ‌డావుడి చేశారు. ఈ మ‌ధ్య మూడు వార‌ల‌కు  75 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింద‌ని  సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో  రాసుకొచ్చారు. దీంతో  అస‌లు అభిమానుల‌కు  శ్రీ‌మంతుడు చిత్రం  ఎన్ని కోట్లు క‌లెక్ట్ చేసింది…నిజంగా  ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం […]

పవన్ ను దాటిన మహేష్
X

విడుద‌లైన మొద‌టి రోజు నుంచి పాజిటివ్ టాక్ గెయిన్ చేసిన చిత్రం శ్రీ‌మంతుడు. అయితే ఈ చిత్రం క‌లెక్ష‌న్స్ గురించి ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు రాసేసుకున్నారు.మొదటి వారంలోనే వంద కోట్లు షేర్ క‌లెక్ట్ చేసిందంటూ హ‌డావుడి చేశారు. ఈ మ‌ధ్య మూడు వార‌ల‌కు 75 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింద‌ని సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో రాసుకొచ్చారు. దీంతో అస‌లు అభిమానుల‌కు శ్రీ‌మంతుడు చిత్రం ఎన్ని కోట్లు క‌లెక్ట్ చేసింది…నిజంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం రికార్డ్స్ ను ఓవ‌ర్ టేక్ చేసిందా లేదా అనే సందిగ్దాలు ఏర్ప‌డ్డాయి. అంత గ‌జిబిజి గంద‌ర గోళం మాట‌లు వినిపించాయి.
క‌ట్ చేస్తే.. తాజాగా శ్రీ‌మంతుడి క‌లెక్ష‌న్స్ పై ఒక క్లారీటి వ‌చ్చింది. శ్రీ‌మంతుడు 25 రోజులు పూర్తి అయిన సంద‌ర్భంగా నిర్మాత‌లు క‌లెక్ష‌న్ల వివ‌రాలు రివీల్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 25 రోజుల‌కు గాను 154 కోట్ల గ్రాస్ … 94 కోట్ల షేర్ సాధించిన‌ట్లు మైత్రీ మూవీస్ సంస్థ దృవీక‌రించింది. దీంతో బాహుబ‌లి త‌రువాత తెలుగులో అత్య‌ధిక వ‌సూలు చేసిన చిత్రంగా శ్రీ‌మంతుడు నిలిచింది. ఒక‌ప్పుడు 50 కోట్లు వ్యాపార‌మే మ‌న తెలుగు సినిమాకు చాల గొప్ప విష‌యంగా చెప్పుకునే వారు. బాహుబ‌లి త‌రువాత‌.. తెలుగు సినిమా మార్కెట్ ప‌రిథిలో చాల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. అన్ని చిత్రాలు బాహుబ‌లి రేంజ్ లో రాక పోయినప్ప‌టికి..స్టార్ హీరోల‌తో చేసే చిత్రాల్లో క‌థ కాస్త బావుంటే.. వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంలో శ్రీ‌మంతుడు మాదిరి ఉంటాయ‌న‌డంలో అతిశ‌యోక్తి కాదు.

First Published:  3 Sep 2015 12:00 AM GMT
Next Story