Telugu Global
Cinema & Entertainment

కామెడీ ఉందికాని కథ లేదు

రేటింగ్‌: 3.25 కొన్ని వందల ఏళ్ళ క్రితమే షేక్‌స్పియర్‌ ఒక సూత్రాన్ని కనుక్కున్నాడు. దాని పేరు కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌. దాన్ని మన సినిమా వాళ్ళు కొన్ని వేలసార్లు వాడేశారు. అదే విధంగామనిషిలోని ఒక లక్షణాన్ని గ్లోరిఫై చేసి కథని చెప్పడాన్ని కూడా సినిమాల్లో అనుసరిస్తున్నారు. ఈ రెండింటిని కలిపి దర్శకుడు మారుతి “భలే భలే మగాడివోయ్‌” సినిమానితీసాడు. హాయిగా నవ్వించే సినిమా ఇది. ప్రారంభంలోనే హిచ్‌కాక్‌ కొటేషన్‌ కనిపిస్తుంది. నాటకం ప్రారంభమైనపుడు లాజిక్‌కి స్థానముండదని. ఈ […]

కామెడీ ఉందికాని కథ లేదు
X

రేటింగ్‌: 3.25

కొన్ని వందల ఏళ్ళ క్రితమే షేక్‌స్పియర్‌ ఒక సూత్రాన్ని కనుక్కున్నాడు. దాని పేరు కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌. దాన్ని మన సినిమా వాళ్ళు కొన్ని వేలసార్లు వాడేశారు. అదే విధంగామనిషిలోని ఒక లక్షణాన్ని గ్లోరిఫై చేసి కథని చెప్పడాన్ని కూడా సినిమాల్లో అనుసరిస్తున్నారు. ఈ రెండింటిని కలిపి దర్శకుడు మారుతి “భలే భలే మగాడివోయ్‌” సినిమానితీసాడు. హాయిగా నవ్వించే సినిమా ఇది.

ప్రారంభంలోనే హిచ్‌కాక్‌ కొటేషన్‌ కనిపిస్తుంది. నాటకం ప్రారంభమైనపుడు లాజిక్‌కి స్థానముండదని. ఈ సినిమాలో కూడా లాజిక్‌ని ఎక్కువ ఆశించకూడదు. చివర్లో ఆశించినదానికంటే ఎక్కువ నాటకీయత కూడా ఉంది.

సినిమా మనల్ని నవ్వించినా చూసినతరువాత ఏం చూశామో మనకు గుర్తుండదు. హీరో మతిమరుపు మనకి కూడా ఎంతోకొంత వచ్చేస్తుంది.దీనికి కారణం ఏంటంటే కథలేకపోవడం.

కొన్ని సన్నివేశాల్ని తయారుచేసుకుని అదే కథ అనుకోవడం ఇప్పుడు చాలామంది చేస్తున్నదే. అదే మారుతి కూడా చేశాడు. మన దగ్గర గులాబీలు ఎన్నివున్నా, మాలగాకట్టడానికి చిన్న దారముండాలి. ఒక సూత్రం లేకుండా సీన్స్‌ని అల్లుకుంటూ పోవడం వల్ల ఫీల్‌ మిస్సవుతాం. అదే ఈ సినిమాలో కూడా జరిగింది.

హీరో నానికి మతిమరుపు. ఒక పనిచేస్తూ ఇంకో పనిలోకి వెళ్ళిపోతాడు. అంతకు ముందు చేస్తున్న పనిని మరిచిపోతాడు. దాని వల్ల ఇబ్బంది పడుతుంటాడు. ఒకరోజు హీరోయిన్‌లావణ్యాత్రిపాఠిని చూస్తాడు. ఆమెని ప్రేమించడానికి చేసే ప్రయత్నాల్లో మతిమరుపు వెంటాడుతూ ఉంటుంది. ఆమె తండ్రితో ఇది వరకే హీరోకి పరిచయముంటుంది. నానిమతిమరుపుని అతను అసహ్యించుకుంటాడు. ఈ నేపధ్యంలో తనంటే ఇష్టంలేని వ్యక్తి కూతుర్నే తాను ప్రేమించానని హీరో తెలుసుకుని తన ఫ్రెండ్‌ వెన్నెల కిషోర్‌ని తనలా యాక్ట్‌చేయమంటాడు. దాంతో కామెడి ఆఫ్‌ ఎర్రర్స్‌ మొదలవుతాయి. మధ్యలో హీరోయిన్‌ని ఇష్టపడిన ఒక పోలీసాఫీసర్‌ అజయ్‌విలనీ.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నాని నటన. మతిమరుపు వ్యక్తిగా అతను పండించిన కామెడీ బావుంది. నానీ స్టామినాని సరిగా వాడుకోలేదని కూడా అనిపించింది.ఎందుకంటే అతని మతిమరుపుని ఎస్టాబ్లిష్‌ చేయడానికి రెండు సన్నివేశాలు చాలు. మిగతా సినిమాలో అంతర్లీనంగా బలమైన కథవుంటే నానీ ఇంకా గొప్పగా నటించేవాడే. చాలాసన్నివేశాల్లో ఈజీనెస్‌ని టైమింగ్‌ని నాని కనబరిచాడు. హీరోయిన్‌కి పెద్దగా యాక్ట్‌ చేయడానికి స్కోప్‌లేదు. పాటలు ఓకే. చివరి పదినిముషాలు అనవసరం అనిపించింది.ఎందుకంటే ఈ సినిమా ప్రేక్షకులు వేరు. వాళ్ళకి మాస్‌ ఫైటింగ్‌ అక్కరలేదు. మాడ్రన్‌ అమ్మాయిగా ఉన్న హీరోయిన్‌ గుడ్డిగా విలన్‌తో వెళ్ళి పెళ్ళిపీటలపై కూర్చోవడం ఔచిత్యంగాలేదు. సినిమా కథకి తలాతోకా అడక్కూడదని రూల్స్‌ ఉన్నప్పటికీ హాయిగా నడుస్తున్న సినిమాకి అనవసర ట్విస్ట్‌లు అవసరం లేదు. అక్కడక్కడ మారుతి బూతు జోక్‌లువేయడానికి ప్రయత్నించి తననుతాను బలవంతంగా కంట్రోల్‌ చేసుకున్నాడు. మొత్తంమీద ఈ సినిమాని నాని తన భుజాలపై మోసాడు. కాసేపు నవ్వుకోవాలనుకున్నవారికి ఈసినిమా ఆశాభంగం కలిగించదు.

– జి.ఆర్‌. మహర్షి

Click Here To Read డైనమైట్ మూవీ రివ్యూ

First Published:  4 Sep 2015 5:46 AM GMT
Next Story