Telugu Global
NEWS

మాజీ సైనికుల గౌరవభృతి రెట్టింపు

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గౌరవ భృతిని రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచుతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన మాజీ సైనికులకు బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో కొంత శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ర్టానికి చెంది ప్రతిభ కనబరిచిన సైనికులను వచ్చే రాష్ర్టావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొనడం ప్రజల్లోకి […]

మాజీ సైనికుల గౌరవభృతి రెట్టింపు
X
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల గౌరవ భృతిని రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచుతున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన మాజీ సైనికులకు బలహీనవర్గాల గృహనిర్మాణ పథకంలో కొంత శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ర్టానికి చెంది ప్రతిభ కనబరిచిన సైనికులను వచ్చే రాష్ర్టావతరణ దినోత్సవాల్లో ఘనంగా సన్మానిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్ గ్రామజ్యోతి కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొనడం ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని తీసుకువెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే బడ్జెట్‌లో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులు, మాజీ పోలీస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ముందుగా వారితో కలిసి భోజనం చేసిన సీఎం అనంతరం ప్రసంగిస్తూ రాష్ర్టానికి చెందిన వివిధ అంశాలను వారితో పంచుకున్నారు. మాజీ సైనికులు తన దృష్టికి తెచ్చిన సమస్యలు చాలా చిన్నవని, వాటన్నింటినీ ప్రభుత్వం అతి త్వరలో పరిష్కరిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. మీనుంచి ఆరుగురి పేర్లు ఎంపిక చేసి ఇవ్వండి. భవిష్యత్‌లో ప్రభుత్వానికి, మీకు మధ్య వారు వారథిలాగా ఉండి పనిచేస్తారు అని కేసీఆర్ సూచించారు.
First Published:  3 Sep 2015 7:09 PM GMT
Next Story