Telugu Global
Others

పోలీస్ క్యాడర్ పోస్టుల విభజన

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా పోలీస్‌శాఖలోని రాష్ట్ర క్యాడర్ పోస్టులను విభజిస్తూ కమలనాథన్ కమిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్‌శాఖ స్టేట్ క్యాడర్ పోస్టుల జాబితాను వారం క్రితం ఏపీ పోలీసులు కమలనాథన్ కమిటీకి సమర్పించారు. దానిని పరిశీలించిన కమిటీ శుక్రవారం రెండు రాష్ర్టాలకు పోస్టులను 42:58 శాతంలో కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై రెండు రాష్ర్టాల డీజీపీలతోపాటు రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులెవరైనా 14వ తేదీలోపు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా పోలీస్‌శాఖలోని రాష్ట్ర క్యాడర్ పోస్టులను విభజిస్తూ కమలనాథన్ కమిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్‌శాఖ స్టేట్ క్యాడర్ పోస్టుల జాబితాను వారం క్రితం ఏపీ పోలీసులు కమలనాథన్ కమిటీకి సమర్పించారు. దానిని పరిశీలించిన కమిటీ శుక్రవారం రెండు రాష్ర్టాలకు పోస్టులను 42:58 శాతంలో కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై రెండు రాష్ర్టాల డీజీపీలతోపాటు రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులెవరైనా 14వ తేదీలోపు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలుపాలని కమలనాథన్ కమిటీ కార్యదర్శి ప్రేంచంద్రారెడ్డి కోరారు. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.
అన్నీ అడహాక్ ప్రమోషన్లేనా?
కమలనాథన్ కమిటీకి పోలీస్‌శాఖ ఇచ్చిన క్యాడర్ పోస్టుల లెక్కలను చూసి రెండు రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులు నిశ్ఛేష్టులయ్యారు. రెండు రాష్ర్టాల్లో దాదాపుగా 965 మంది డీఎస్పీలుండగా కమలనాథన్ కమిటీకి ఇచ్చిన జాబితాలో కేవలం 437 డీఎస్పీలు సివిల్ పోస్టులే ఉన్నట్టు తేలింది. జాబితా తయారీలో పొరపాటు జరిగినా ఐదోపదో తేడా ఉంటుందికానీ ఏకంగా 500లకుపైగా పోస్టులు తేడా రావటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది.
First Published:  4 Sep 2015 1:02 PM GMT
Next Story