Telugu Global
Cinema & Entertainment

క‌త్రీనా కైఫ్  క‌ష్టమ్స్...

క‌త్రీనా కైఫ్ ఇప్పుడు ఒక స్టార్ డ‌మ్ వున్న న‌టి అనిపిస్తుంది. అనిపించ‌డం కాదు. నిజం . అయితే కెరీర్ ప్రారంభంలో చాల మంది హీరోయిన్స్ మాదిరే పొర్ట్ ఫొలియో ప‌ట్టుకుని ఆఫీసుల చుట్టు తిరిగార‌ట‌. క‌త్రీనా మ‌ద‌ర్ ఇండియ‌న్, ఫాద‌ర్ మ‌హ్మాద్ కైఫ్ ఇండియ‌న్ బేస్డ్ లండ‌న్ సెటిల్డ్. వీరిద్ద‌రికి ఎనిమిది మంది సంతానం. క‌త్రీనా కైఫ్ నాలుగో సంతానం. క‌త్రీనా చిన్న‌ప్పుడే త‌ల్లి దండ్రులు విడిపోయార‌ట‌. త‌ల్లి సంతానాని పెంచి పెద్ద చేశారు. క‌త్రీనా […]

క‌త్రీనా కైఫ్  క‌ష్టమ్స్...
X

క‌త్రీనా కైఫ్ ఇప్పుడు ఒక స్టార్ డ‌మ్ వున్న న‌టి అనిపిస్తుంది. అనిపించ‌డం కాదు. నిజం . అయితే కెరీర్ ప్రారంభంలో చాల మంది హీరోయిన్స్ మాదిరే పొర్ట్ ఫొలియో ప‌ట్టుకుని ఆఫీసుల చుట్టు తిరిగార‌ట‌. క‌త్రీనా మ‌ద‌ర్ ఇండియ‌న్, ఫాద‌ర్ మ‌హ్మాద్ కైఫ్ ఇండియ‌న్ బేస్డ్ లండ‌న్ సెటిల్డ్. వీరిద్ద‌రికి ఎనిమిది మంది సంతానం. క‌త్రీనా కైఫ్ నాలుగో సంతానం. క‌త్రీనా చిన్న‌ప్పుడే త‌ల్లి దండ్రులు విడిపోయార‌ట‌. త‌ల్లి సంతానాని పెంచి పెద్ద చేశారు. క‌త్రీనా వాళ్ల మ‌ద‌ర్.. సోష‌ల్ స‌ర్వీస్ ఆర్గ‌నైజ‌న్స్ లో చేస్తారు. దీంతో ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప‌ని చేయ‌డం వ‌ల్ల‌ చైనా, ఫ్రాన్స్, స్విట్జ‌ర్లాండ్, పోల్యాండ్, జ‌పాన్, బెల్జియ‌మ్, హాంకాంగ్ ఇలా ప‌లు దేశాలు తిరిగార‌ట‌. కైట్స్ హాంకాంగ్ లో పుట్టింద‌ట‌. దేశాలు తిరిగి చివ‌ర‌కు క‌త్రీనా వాళ్ల ఫ్యామిలీ లండ‌న్ లో సెటిల‌య్యార‌ట.

లండ‌న్ లో మోడ‌ల్ గా చేస్తున్న‌ప్పుడు.. నిర్మాత కైజాద్ గుస్తాద్, బూమ్ లో ఒక పాత్ర ఇచ్చారు. అది పెద్ద‌గా పేరు తేలేదు. త‌న బాలీవుడ్ ఎంట్రీ బూమ్ చిత్రంతోనే జ‌రిగింది. న‌టిగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్పుడు.. చాల సినిమా క‌ష్టాలు ఫేస్ చేసింద‌ట‌. హీరోయిన్ అవ్వ‌క ముందు.. ఆడిష‌న్స్ జ‌రిగేవి.. ఆ ఫోటోల్ని పెద్ద పెద్ద సైజ్ లో చేయించి .. ఫోన్ నెంబ‌ర్ పెట్టే వార‌ట‌. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పనికిరాద‌నే మాట‌లు, విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. వాటిన్నింటిని చాలెంజ్ గా తీసుకుని.. క‌త్రీనా ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లుగా ఎదిగింది. ఈ రోజు క‌త్రీనా అంటే సెల్ఫ్ డిస‌ప్లేన్ కు , పంక్చువాలిటికి పెట్టింది పేరు. హీరోయిన్ గా గ్లామ‌ర్ రోల్ నుంచి.. ప్ర‌స్తుతం యాక్ష‌న్ హీరోయిన్ గా మారుతుంది. ఏక్ థా టైగ‌ర్, ఫాంట‌మ్ చిత్రాల్లో క‌త్రీనా భారీ ఫైట్స్ చేసి మెప్పించింది. క‌ష్టాల్ని త‌ట్టుకుని.. న‌మ్మ‌కంతో ప్ర‌య‌త్నిస్తే గెలుపు వ‌స్తంది అన‌డానికి క‌త్రీనా కైఫ్ ఒక ఎగ్జాంపుల్ అంటారు క్రిటిక్స్.

First Published:  5 Sep 2015 7:05 PM GMT
Next Story