Telugu Global
Others

తెలుగుకు అంతర్జాతీయ వెలుగులు

బహుళజాతి కంపెనీల్లో అగ్రాసనాల్లో భారతీయులు కీలకమైన ట్వీట్టర్ సీఈవోగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు అమ్మాయి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ గత 20 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఇప్పటి దాకా ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత పదవి కోసం ఆ సంస్థ ఆరుగురు పేర్లను పరిశీలించింది. అయితే పద్మశ్రీకి స్టెన్సార్ స్టూవర్ట్ అనే మరో వ్యక్తికి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరిని […]

తెలుగుకు అంతర్జాతీయ వెలుగులు
X

బహుళజాతి కంపెనీల్లో అగ్రాసనాల్లో భారతీయులు
కీలకమైన ట్వీట్టర్ సీఈవోగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు అమ్మాయి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ గత 20 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఇప్పటి దాకా ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత పదవి కోసం ఆ సంస్థ ఆరుగురు పేర్లను పరిశీలించింది. అయితే పద్మశ్రీకి స్టెన్సార్ స్టూవర్ట్ అనే మరో వ్యక్తికి మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరిని సీఈవో పదవి వరిస్తుందో సస్పెన్స్. అయితే కన్సూమర్ ఇంటర్నెట్ వ్యాపారంలో ఆరి తేరిన పద్మశ్రీ వారియర్ వైపే ట్విట్టర్ యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ట్విట్టర్‌ యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోనుంది. ప్ర‌పంచ కార్పోరేట్ రంగంలో భార‌తీయ దిగ్గ‌జాల‌పై అందరి దృష్టి ప‌డింది. ఇప్ప‌టికే ఎంతోమంది భార‌తీయులు ప్ర‌పంచ కార్పోరేట్ రంగంలో దిగ్గ‌జాలుగా కీర్తి ప్ర‌తిష్ట‌లు ఆర్జించారు. వారిలో ముఖ్యులు మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో స‌త్య‌ నాదేళ్ల(47) నోకియా కంపెనీ హెడ్ రాజీవ్‌ సూరి (47), శాన్‌డిస్కో ప్రెసిడెంట్ సంజ‌య్ మోహ్రోత్రా (56), ఆడోబ్ సిస్ట‌మ్స్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ (52), పెప్సికో సీఈవో ఇంద్ర‌సూయి(59), ఆర్సెల‌ర్ ఉక్కు త‌యారీ కంపెనీ చైర్మ‌న్‌, సీఈవో ల‌క్ష్మీ మిట్ట‌ల్ (64), మ‌ల్టీ నేష‌న‌ల్ ఆల్క‌హాల్ బేవ‌రేజ్ కంపెనీ డియాజియో సీఈవో ఇవాన్ మెనెంజిస్(56)తోపాటు ఇంకా ప‌లువురు ప్ర‌ముఖులు కార్పోరేట్ దిగ్గ‌జాలుగా కార్పొరేట్‌ రంగాన్ని శాసిస్తున్నారు. ఇపుడు మళ్ళీ పద్మశ్రీ పేరును ట్విట్టర్‌ యాజమాన్యం పరిశీలించడం భారతీయులకే వన్నె తెచ్చే అంశంగా చెప్పవచ్చు.​

First Published:  6 Sep 2015 12:13 AM GMT
Next Story