Telugu Global
Others

డిగ్గీరాజాకు రెండో రాణి

దిగ్విజయం’గా రెండో పెళ్లి రాజుగారు రెండో పెళ్లి జ‌రిగిపోయింది. కానీ ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. మొద‌టి రాణి మ‌ర‌ణించ‌గా, మ‌నుమ‌ల్ని ఎత్తుకుంటున్న ఏజ్‌లో  రెండో రాణిని మ‌నువాడాడు. గ‌త నెల‌లో జ‌రిగిన  ఈ వివాహం రాజుగారి ప‌రోక్షంలో రాణిగారు అంటే టీవీ యాంక‌ర్ అమృతారాయ్  సోష‌ల్‌మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.  హిందూ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం దిగ్విజయ్ తో పెళ్లి జరిగినట్లు అమృతా ఫేస్ బుక్ లో స్నేహితులకు తెలిపింది. తర్వాత ఈ పెండ్లిని రిజిస్టర్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఏడాదిక్రితం […]

డిగ్గీరాజాకు రెండో రాణి
X
దిగ్విజయం’గా రెండో పెళ్లి
రాజుగారు రెండో పెళ్లి జ‌రిగిపోయింది. కానీ ఆల‌స్యంగా వెలుగులోకొచ్చింది. మొద‌టి రాణి మ‌ర‌ణించ‌గా, మ‌నుమ‌ల్ని ఎత్తుకుంటున్న ఏజ్‌లో రెండో రాణిని మ‌నువాడాడు. గ‌త నెల‌లో జ‌రిగిన ఈ వివాహం రాజుగారి ప‌రోక్షంలో రాణిగారు అంటే టీవీ యాంక‌ర్ అమృతారాయ్ సోష‌ల్‌మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. హిందూ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం దిగ్విజయ్ తో పెళ్లి జరిగినట్లు అమృతా ఫేస్ బుక్ లో స్నేహితులకు తెలిపింది. తర్వాత ఈ పెండ్లిని రిజిస్టర్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఏడాదిక్రితం అమృత, దిగ్విజయ్ ఫోటోలు హల్ చల్ చేశాయి. ఏడు ప‌దుల వ‌య‌స్సున్న డిగ్గీరాజా త‌న కుమార్తె వ‌య‌స్సున్న అమృతారాయ్‌తో చాలా ఏళ్లుగా ప్రేమాయ‌ణం న‌డిపాడు. లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ‌పై నెటిజ‌న్ల మ‌ధ్యే పెద్ద చ‌ర్చే న‌డిచింది. వీరిద్దరి మధ్య సహజీవనం విషయం గత ఏడాది బయట ప‌డింది. 44 ఏళ్ల వ‌య‌స్సున్న అమృత‌కు గ‌తంలో పెళ్లి అయ్యింది. ఆ భ‌ర్త నుంచి విడాకులు తీసుకుని దిగ్విజ‌య్‌ను పెళ్లాడింది. దిగ్విజయ్ సింగ్ భార్య 2013లో సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజ కుటుంబానికి చెందిన దిగ్విజయ్ సింగ్‌కు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడున్నారు. దిగ్విజ‌య్ ప్రేమ‌పై త‌న‌కెంతో న‌మ్మ‌కం ఉంద‌ని, ఆయనకు గల ఆస్తులను పిల్ల‌ల‌కు ఇవ్వాల్సిందిగా తాను కోరాన‌ని అమృత సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. పెళ్ల‌యిన నెల‌కు విష‌యం బ‌య‌ట ప్ర‌పంచానికి చెప్పిన అమృత అస‌లు విష‌యం మాత్రం చెప్ప‌లేదు. న్యూ క‌పుల్ ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అంటే హ‌నీమూన్‌లాంటిదేమ‌న్నా..అని అనుమానం ప‌డొద్దు. దిగ్విజ‌య్ అమెరికాలో ఉన్నార‌ని తెలుస్తోంది. రాజ్య‌స‌భ యాంక‌ర‌మ్మ, రెండో రాణిగారు అయిన అమృతారాయ్ కూడా సెల‌వులోనే ఉన్నారు.
First Published:  6 Sep 2015 8:15 PM GMT
Next Story