Telugu Global
Others

గిప్ట్‌ కూపన్ల గోల్‌మాల్‌..!

పండగలు వచ్చాయంటే చాలు బట్టల షాపులు, ఎలక్ట్రానిక్‌ షాపులు కష్టమర్లకోసం లక్షల కొద్దీ విలువైన ప్రైజులు ప్రకటిస్తాయి. కేజీలకొద్దీ బంగారం, కార్లు, ఫ్రిజ్‌లు, నగదు బహుమతులు ఇస్తామంటూ కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇస్తారు. మనంవెళ్ళి షాపింగ్‌చేస్తే ఇంత కొంటే ఇన్ని కూపన్లంటూ మనచేత ఎక్కువ ఖర్చు పెట్టించి పెద్ద సంఖ్యలో కూపన్లు అందజేస్తారు. వాటిని నింపి, వాటిమీద మన పేరు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్లు రాసేసరికి మన చేతులు పడిపోతాయి. డ్రా ఎప్పుడు తీస్తారంటే, మీ కూపన్‌ […]

గిప్ట్‌ కూపన్ల గోల్‌మాల్‌..!
X

పండగలు వచ్చాయంటే చాలు బట్టల షాపులు, ఎలక్ట్రానిక్‌ షాపులు కష్టమర్లకోసం లక్షల కొద్దీ విలువైన ప్రైజులు ప్రకటిస్తాయి. కేజీలకొద్దీ బంగారం, కార్లు, ఫ్రిజ్‌లు, నగదు బహుమతులు ఇస్తామంటూ కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇస్తారు.
మనంవెళ్ళి షాపింగ్‌చేస్తే ఇంత కొంటే ఇన్ని కూపన్లంటూ మనచేత ఎక్కువ ఖర్చు పెట్టించి పెద్ద సంఖ్యలో కూపన్లు అందజేస్తారు. వాటిని నింపి, వాటిమీద మన పేరు, అడ్రస్‌, ఫోన్‌ నెంబర్లు రాసేసరికి మన చేతులు పడిపోతాయి.
డ్రా ఎప్పుడు తీస్తారంటే, మీ కూపన్‌ వెనుకే వివరాలు ఉన్నాయంటారు. కొన్ని వీక్లీడ్రాలు, కొన్ని మంత్లీ డ్రాలు, కొన్ని ఫైనల్‌ డ్రాలు ఉంటాయి. విజేతల వివరాలు షాపుల దగ్గర బోర్డులు పెడతామంటారు. ఫలానా పేపర్లో, ఫలానా రోజు ప్రకటన ఇస్తామంటారు. మనం సంతోషంగా ఆ కూపన్లు తీసుకువచ్చి ఇంట్లో దాచిపెడతాం. ఎక్కువ మంది డ్రా ఫలితాల గురించి షాపులకు వెళ్ళిచూడరు. వాళ్ళు ఫలితాలు ప్రకటిస్తామన్న రోజున గుర్తుపెట్టుకొని ఆ పేపర్‌ చూడరు.
ఏదో ఒక పెద్ద బహుమతిని, ఒక పెద్ద వ్యక్తి చేతో, సినీ నటీనటుల చేతో డ్రా తీయించి, బహుమతి పొందిన వారికి మీడియా సమక్షంలో ఫోన్‌ చేసి, విజేతను ఆహ్వానించి, బహుమతి అందజేసి, ఆ ఫోటోలను పేపర్లో వేయించుకుంటారు. కాని వందలకొద్దీ చిన్న బహుమతుల గురించి ఎవరూ పట్టించుకోరు. డ్రా తీసినా, బహుమతి వచ్చిన ఆ కూపన్‌ మీద వారి పేరు, ఫోన్‌ నంబర్‌ ఉన్నా వాళ్ళకి ఫోన్‌ చెయ్యరు. బహుమతి అందజేయరు. షాప్‌ ముందో, పేపర్లోనో ఒక ప్రకటన ఇచ్చి ఊరుకుంటారు, కొందరు అదీ చేయరు.
దీంతో అనేక బహుమతులు కష్టమర్లకు చేరడం లేదు. ప్రభుత్వం కనుక పూనుకొని గత నాలుగైదు ఏళ్ళ నుంచి ఎవరెవరు ఎన్నెన్ని బహుమతులు ప్రకటించారు? కష్టమర్లకు ఎన్ని అందజేశారు? అనే వివరాలు అడిగితే ఈ బహుమతుల డొల్ల బయటపడుతుంది. బహుమతుల పేరుతో సాగే ఈ మోసానికి తెరపడుతుంది.

First Published:  8 Sep 2015 4:27 AM GMT
Next Story