Telugu Global
Others

టమోటా కిలో రూపాయి కన్నా తక్కువే!

ఓ నెల క్రితం… కిలో టమోటా రూ. 30. ఓ వారం క్రితం… కిలో రూ. 20… మొన్నటి మాట… కిలో 10. ఈరోజు… కిలో ఒకే ఒక్క రూపాయి. కొంతమందికి కాసులు కురిపించే ఈ పంట… కొంతమందికి పెట్టుబడి కూడా రాకుండా చేస్తుంది. పెట్టుబడే కాదు… అసలు పైసా కూడా రాకుండా చేస్తోంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాల దెబ్బకు టమోటా రైతు కుదేలైపోయాడు. ఏపీలోనే అతి పెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు నిత్యం సీజన్‌తో పని […]

టమోటా కిలో రూపాయి కన్నా తక్కువే!
X
ఓ నెల క్రితం… కిలో టమోటా రూ. 30. ఓ వారం క్రితం… కిలో రూ. 20… మొన్నటి మాట… కిలో 10. ఈరోజు… కిలో ఒకే ఒక్క రూపాయి. కొంతమందికి కాసులు కురిపించే ఈ పంట… కొంతమందికి పెట్టుబడి కూడా రాకుండా చేస్తుంది. పెట్టుబడే కాదు… అసలు పైసా కూడా రాకుండా చేస్తోంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాల దెబ్బకు టమోటా రైతు కుదేలైపోయాడు. ఏపీలోనే అతి పెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు నిత్యం సీజన్‌తో పని లేకుండా 200 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి వస్తోంది. ఇక్కడ నాలుగు రోజుల క్రితం వరకు నాణ్యమైన టమోటా కిలో ధర రూ.10 పలుకగా, నేడు నాణ్యత లేదన్న కారణంతో కిలో రూపాయి కన్నా తక్కువ అంటే… రూ.80 పైసలకే పడిపోయింది. దీంతో రైతులు, వ్యాపారులతో గొడవకు దిగారు. తాము మార్కెట్‌కు తెచ్చిన తర్వాత ధర ఇలా తగ్గించేస్తే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మదనపల్లె మార్కెట్‌కు 600 టన్నుల దాకా టమోటా రావడంతో కొనేవారులేక కాయలు మార్కెట్‌లోనే కుళ్లి పోతున్నాయి. కొనేవారు లేక అనంతపురం జిల్లా నుంచి కూడా ఇక్కడకే తెస్తున్నారు. నిజానికి మదనపల్లె నుంచి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీకి టమోటా ఎగుమతి అవుతోంది. నాణ్యమైన టమోటాలైతేనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించినా చెక్కుచెదరకుండా నిల్వ వుంటాయి. వర్షంతో మదనపల్లెకు వస్తున్న టమోటాలు పూర్తిగా మచ్చలు పడి తడిచి ముద్దయి పోతున్నాయి. దీంతో నాణ్యతలేని టమోటాను కొనడానికి దూరప్రాంత వ్యాపారులు మొగ్గుచూపడం లేదు. ఫలితంగా ఒక్కసారిగా టమోటా ధర కిలో రూపాయి కన్నా దిగువకు పడిపోయింది.
First Published:  8 Sep 2015 5:09 AM GMT
Next Story