Telugu Global
Cinema & Entertainment

హైదరాబాద్ లో షారూక్ కు పనేంటి..?

కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ హైదరాబాద్ లో ఉన్నాడు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చిన షారూక్ ఖాన్ తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతున్నాడు. ఇంతకీ భాగ్యనగరంలో బాద్ షా ఏం చేస్తున్నాడు..? తన కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అవును.. షారూక్-కాజోల్ హీరోహీరోయిన్లుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దివాలే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామో జీ ఫిలింసిటీలోని హైవేపై షారూక్, కాజోల్ పై కొన్ని సన్నివేశాలు […]

హైదరాబాద్ లో షారూక్ కు పనేంటి..?
X
కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ హైదరాబాద్ లో ఉన్నాడు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చిన షారూక్ ఖాన్ తన పని తాను సైలెంట్ గా చేసుకుపోతున్నాడు. ఇంతకీ భాగ్యనగరంలో బాద్ షా ఏం చేస్తున్నాడు..? తన కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అవును.. షారూక్-కాజోల్ హీరోహీరోయిన్లుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దివాలే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామో జీ ఫిలింసిటీలోని హైవేపై షారూక్, కాజోల్ పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈనెల 27 వరకు హైదరాబాద్ లోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుంది. మరోవైపు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న వరుణ్ ధావన్, కృతి సనోన్ కూడా హైదరాబాద్ లోనే తిష్టవేశారు. వీళ్లతో వచ్చే కొన్ని సన్నివేశాల్ని కూడా తీస్తున్నారు. దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే సినిమాతో ఆల్ టైం రొమాంటిక్ కపుల్ గా పేరుతెచ్చుకుంది షారూక్-కాజోల్ జోడీ. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ నటిస్తున్న సినిమా ఇది. యాక్షన్, కామెడీ లాంటి అంశాలకు దూరంగా కంప్లీట్ రొమాంటిక్ యాంగిల్ లో సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఈ సినిమాపై బాగా అంచనాలున్నాయి.
First Published:  7 Sep 2015 7:01 PM GMT
Next Story