Telugu Global
Others

ఆయుర్‌... ఇది వేద చికిత్స

ఆరోగ్యమే మహాభాగ్యం, దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా దేహాన్ని పరిరక్షించుకోవాలంటే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకే నిత్యజీవితంలో ఆయుర్వేదం ఒక భాగం… కావాలి అంటారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌Šరజతన్‌. ఆయుర్వేదం…మనవేదాల్లో ఉదహరించిన అంశం…అనీ, ఇది వేల ఏళ్ల కిందట నిరూపితమైన భారతీయ సంప్రదాయ వైద్య ప్రక్రియ అన్నారు. ఆధునిక కాలంలోనూ శాస్త్రబద్ధంగా పరిశోధనలు జరుగుతున్నాయని, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడం ఈ వైద్యవిధానం ప్రత్యేకత అంటారాయన. ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా వినిపించే కొన్ని పదాలకు అర్థాన్ని […]

ఆయుర్‌... ఇది వేద చికిత్స
X

ఆరోగ్యమే మహాభాగ్యం, దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా దేహాన్ని పరిరక్షించుకోవాలంటే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకే నిత్యజీవితంలో ఆయుర్వేదం ఒక భాగం… కావాలి అంటారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌Šరజతన్‌. ఆయుర్వేదం…మనవేదాల్లో ఉదహరించిన అంశం…అనీ, ఇది వేల ఏళ్ల కిందట నిరూపితమైన భారతీయ సంప్రదాయ వైద్య ప్రక్రియ అన్నారు. ఆధునిక కాలంలోనూ శాస్త్రబద్ధంగా పరిశోధనలు జరుగుతున్నాయని, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకపోవడం ఈ వైద్యవిధానం ప్రత్యేకత అంటారాయన. ఆయుర్వేద వైద్యంలో ప్రధానంగా వినిపించే కొన్ని పదాలకు అర్థాన్ని వివరించడంతోపాటు వాటి ఆవశ్యకత తెలియజేశారు. ఇవన్నీ అనారోగ్యాలను ™తొలగించడంతోపాటు దేహం అనే యంత్రాన్ని కండిషన్‌లో ఉంచడానికి దోహదం చేస్తాయంటారాయన.

పంచకర్మ థెరపీ అంటే ఏమిటి? అందులో ఏయే చికిత్సలు ఉంటాయి?
పంచకర్మ ప్రక్రియ ద్వారా దేహంలోని అంతర్గత భాగాలను పరిశుభ్రంచేయడం జరుగుతుంది. దేహాన్ని సమగ్రంగా శుభ్రపరిచే ఈ చికిత్స విధానం…ఐదు ప్రక్రియల సమ్మేళనం. అందుకే దీనిని పంచకర్మ చికిత్స ప్రక్రియ అంటారు. ఆ ఐదు చికిత్స ప్రక్రియలు… వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్ష„చికిత్సలు.

వమన అంటే?
జీర్ణాశయాన్ని, దేహంలో పై అర్థభాగాన్ని శుభ్రపరిచే ప్రక్రియ. ఔషధీయ జలాన్ని కడుపులోకి పంపించి ఆ నీటిని †తిరిగి వమన…(వాంతి) చేయిస్తారు. దీంతో కడుపులోని మలినాలతోపాటు కఫదోషాలు కూడా తొలగిపోతాయి.

విరేచన అంటే?
దేహంలో కింది అర్థభాగాన్ని శుభ్రంచేసే ప్రక్రియ విరేచన చికిత్స. పెద్దపేగులు, మలవిసర్జకావయవాలలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. దాంతో ఈ భాగాలన్నీ శుభ్రపడి వాటి పనితీరు సమర్థవంతమవుతుంది. పైత్యదోషాలు తొలగిపోతాయి.

వస్తి అంటే?
మూత్రాశయం ద్వారం, యోని ద్వారం, మలద్వారం వంటి అవయవాలను శుభ్రపరుస్తారు. వస్తి చికిత్స ద్వారా వాత వైఫల్యాలు నివారణ అవుతాయి.

నస్య అంటే?
ఈ పద్ధతిలో నాసికా రంధ్రాల ద్వారా ఔషధం ఇస్తారు. శ్వాససంబంధిత విభాగాలు శుభ్రపడతాయి. ప్రస్తుతం వాహనాల వాడకం ఎక్కువ కావడంతో వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువైంది. నగరాల్లో ఇంటి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. దీంతో శ్వాసకోశ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఏదో ఒక వ్యాధి బారిన పడిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ఆరు నెలలకోసారి ఈ విధంగా మన సిస్టమ్‌ని శుభ్రం చేసుకుంటుంటే అనేక దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు.

రక్తమోక్ష అంటే?
ఇది వినడానికి కొంచెం ఒళ్లు జలదరించేటట్లు ఉంటుంది. కానీ ఏ మాత్రం నొప్పి లేని చికిత్స. రక్తమోక్ష అంటే జలగతో రక్తాన్ని పీల్పించడం. వ్యాధి కారణంగా రక్తం కలుషితమైన సందర్భంలో ఆ చెడు రక్తాన్ని దేహం నుంచి తొలగించడానికి రక్తమోక్ష చికిత్స చేస్తారు. తర్వాత దేహం తిరిగి కొత్త రక్తాన్ని పెంచుకోవడానికి మందులు ఇస్తారు.

ధార చికిత్స అంటే ఏమిటి?
ధార అంటే దేహంలో ఏదైనా ఒక భాగం మీద నిరంతరాయంగా ఔషధాన్ని ధారగా పోయడం. ఔషధతైలాన్ని పోసే చికిత్సను తైలధార అంటారు. మజ్జిగను పోస్తూ చేసే చికిత్సను తక్రధార అంటారు. అలాగే పాలను ధారగా పోయడాన్ని క్షీరధార అంటారు. నిద్రలేమి, కీళ్ల సమస్యల నుంచి ఉపశమనానికి ఈ చికిత్సలు దోహదం చేస్తాయి. మానసిక రుగ్మతలను కూడా దూరం చేస్తుంది.

రకరకాల మర్దనలను కూడా సూచిస్తుంటారు?
దేహభాగాన్ని, సమస్యను బట్టి ఆయుర్వేదంలో రకరకాల మర్దనలు ఉంటాయి. కీళ్ల సమస్యలకు పిళ్‌షిల్‌ అని ఉంటుంది. గోరువెచ్చటి నూనెను ఎక్కువమోతాదులో దేహమంతా తడిసేలా పోసి, దేహాన్ని సున్నితంగా మర్దన చేస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి నవరక్కిళి మర్దన సూచిస్తారు. ఇందులో కొన్ని ఔషధాలను, ఉడికించిన నవధాన్యాలను పలుచని సంచిలోవేసి మూటగట్టి ఆ మూటతో దేహానికి మర్దన చేస్తారు.

చర్మవ్యాదులను తగ్గించే మర్దన ప్రక్రియలున్నాయా?
తక్రధారలో ఔషధాలు కలిపిన మజ్జిగ మిశ్రమాన్ని దేహమంతా ధార చేయాలి. స్నేహనమ్‌, లేపం ప్రక్రియ కూడా చర్మవ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

ఇంకా ప్రధానమైన చికిత్సలేమి ఉంటాయి?
ఉధవర్తనమ్‌, థలపోతిచిల్‌, నవరాతెప్పు, స్నేహపానమ్‌, స్వేదనమ్‌, అభ్యంగం, ఉపానహమ్‌, పాల్‌పుక, కిఝ, పిచ్చు, లేపం.. ఇలా వేర్వేరు చికిత్స ప్రక్రియలు ఉన్నాయి.

స్నేహపానమ్‌ అంటే?
ఔషధాన్ని నెయ్యి లేదా ఇతర తైలాలతో కలిపి కడుపులోకి తీసుకుంటారు. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స.

స్వేదనమ్‌ అంటే?
ఇది దేహంలోని మలినాలను చెమట ద్వారా బయటకు పంపించే ప్రక్రియ. పంచకర్మ చికిత్స చేయడానికి ముందుగా స్వేదన చికిత్స చేస్తారు. ఇందులో 13 పద్ధతులు ఉన్నాయి. ఆర్ధరైటిస్‌ సమస్య ఉన్న వాళ్లకు స్వేదన ప్రక్రియను ఔషధాలు కలిపిన పాలతో చేస్తారు. దీనిని పాల్‌పుక చికిత్స అంటారు.

నొప్పుల నివారణకు చికిత్స ఎలా ఉంటుంది?
నోప్పుల నుంచి ఉపశమనానికి, కండరాల పట్టేసినట్లుండే సమస్య నుంచి దేహం వదులవడానికి పిచుప్రక్రియ మంచిది. ఔషధతైలాలలో ముంచిన వస్త్రాన్ని నొప్పుల మీద కాపడం పెడతారు. అభ్యంగం కూడా నొప్పుల ఉపశమనానికి దోహదం చేస్తుంది. అభ్యంగం అంటే ఔషధతైలాన్ని దేహమంతా పట్టిస్తారు.

ఆయుర్వేద ఔషధీయ చికిత్సాలయాల్లో చికిత్స ప్రధానంగా మూడు అంశాల మీద ఉంటుంది. అలసిన దేహాన్ని, మెదడుని, మనసుని సేదదీర్చి ఆహ్లాదపరచడం ప్రధానంగా ఉంటుంది. వీటికి జవసత్వాలను తిరిగి జనింపచేయడానికి ఈ చికిత్సలు దోహదం చేస్తాయి. మా హాస్పిటల్‌ ఆవరణలో రకరకాల ఔషధ వృక్షాలున్నాయి. మా దగ్గర చికిత్స పొందిన పేషెంట్లు తిరిగి వెళ్లేటప్పుడు ఇంట్లో పెంచుకోవలసిందిగా ఒక ఔషధమొక్కను ఇస్తాం. ఇలా చేయడం వల్ల ఔషధాల గురించిన అవగాహన పెరుగుతుందని అలా చేస్తున్నాం. అంతరించిపోతున్న వృక్షజాతులను పరిరక్షించడం కూడా ఒక కారణమే.

– డాక్టర్‌ కె.ఎస్‌. రజితన్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌,
ఔషధి పంచకర్మ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, త్రిశూర్‌, కేరళ

First Published:  9 Sep 2015 5:08 AM GMT
Next Story