Telugu Global
Others

హైదరాబాద్‌లో 50 బైక్‌ అంబులెన్స్‌లు!

ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడి రోగి ఆరోగ్యాన్ని కాపాడే చర్యల్లో భాగంగా బైక్‌ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. కేరళ, కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉన్న బైక్ అంబులెన్సుల విధానాన్ని తెలంగాణాలో కూడా ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 336 ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కకున్న అంబులెన్సు.. అందులో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడి పరిస్థితి వర్ణనాతీతం. అంబులెన్స్‌కు దారి వదలాలని ముందున్న వాహనదారుడికి ఉన్నా.. పక్కకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో […]

హైదరాబాద్‌లో 50 బైక్‌ అంబులెన్స్‌లు!
X
ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడి రోగి ఆరోగ్యాన్ని కాపాడే చర్యల్లో భాగంగా బైక్‌ అంబులెన్స్‌లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. కేరళ, కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉన్న బైక్ అంబులెన్సుల విధానాన్ని తెలంగాణాలో కూడా ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్రంలో 108 అంబులెన్సులు 336 ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కకున్న అంబులెన్సు.. అందులో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడి పరిస్థితి వర్ణనాతీతం. అంబులెన్స్‌కు దారి వదలాలని ముందున్న వాహనదారుడికి ఉన్నా.. పక్కకు వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాద బాధితులు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యే వారిని దవాఖానకు చేర్చడం ఎలా అన్న అంశంపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే బైక్‌ అంబులెన్స్‌ల ఆలోచన ముందుకొచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదానికి గురైన వారి వద్దకు 108 ముందుగా రోగులను అంబులెన్సులు చేరడానికి ఎంత సమయం పడుతుందో.. వారిని దవాఖానకు చేర్చేందుకు అంతకన్నా ఇంకా ఎక్కువ సమయం పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో హైదరాబాద్‌లో ఉండే ట్రాఫిక్, ప్రమాద బాధితుల ప్రాణాల మీదకు తెస్తున్నది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 50 బైక్ అంబులెన్సులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. రోగుల నుంచి వస్తున్న కాల్స్‌లో 20 శాతం కేసులకు 108 అంబులెన్సులు అవసరం లేదని అధికారులు గుర్తించారు. అదే బైక్ అంబులెన్సులైతే ప్రాథమిక చికిత్సే ప్రధాన ఎజెండా రూపొందించినవి కాబట్టి తక్కువ వ్యయం, తక్కువ టైంలోనే ఘటన స్థలానికి చేరుకొంటాయి. మొత్తం 50 బైక్‌ల కొనుగోలుకు రూ.77.46 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ బైక్ అంబులెన్సులు ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అందుబాటులో ఉండాలని, బైక్ అంబులెన్సును శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్ (ఈఎంటీ) ఆపరేట్ చేసేలా చూడాలని, ఈ బైక్ అంబులెన్సులో అత్యవసర మందులు, చిన్న ఆక్సిజన్ సిలిండర్, సర్వికల్ కూలర్, ప్రాథమిక చికిత్స కిట్ అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు.
First Published:  9 Sep 2015 11:13 AM GMT
Next Story