Telugu Global
Others

బంగారం బాండ్ల జారీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

బంగారం స్థానంలో బాండ్లను జారీ చేయడానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్ల జారీకి నిర్ణయం తీసుకుంది. బంగారం స్థానంలో ఆర్‌బీఐ బాండ్లను జారీ చేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని ఆరు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కరువు భత్యం ప్రస్తుతం 113 శాతం […]

బంగారం బాండ్ల జారీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
X
బంగారం స్థానంలో బాండ్లను జారీ చేయడానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 5, 10, 50, 100 గ్రాముల లెక్కన బాండ్ల జారీకి నిర్ణయం తీసుకుంది. బంగారం స్థానంలో ఆర్‌బీఐ బాండ్లను జారీ చేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని ఆరు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు కరువు భత్యం ప్రస్తుతం 113 శాతం కాగా, పెంపునకు ఆమోదముద్ర పడటంతో ఇది 119 శాతానికి చేరుతుంది. దీనివల్ల దేశంలోని కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 107 శాతంగా ఉన్న కరువుభత్యాన్ని 6 శాతం పెంచిన ప్రభుత్వం, దాన్ని జనవరి నుంచి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మూలవేతనం ప్రాతిపదికగా లెక్కించే కరువు భత్యం తాజా పెంపుపై కేబినెట్‌ ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. నిరుడు జూలై 1 నుంచి ఈ ఏడాది జూన్‌ 30 వరకు గల 12 నెలల పారిశ్రామిక కార్మిక-వినియోగదారు ధరల సూచీ సగటు ఆధారంగా ఈ పెంపును నిర్ణయిస్తారు. అలాగే వినియోగంలో లేని స్పెక్ట్రమ్‌ కొనుగోలు లేదా అమ్మాలని నిర్ణయించింది. సముద్రతీరంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అదేవిధంగా టెలికం సంస్థలకు ఊతమిచ్చే దిశగా కేంద్ర మంత్రివర్గం చర్యలు చేపట్టింది. వినియోగంలో లేని స్పెక్ట్రం కొనుగోలుపై విధివిధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వినియోగంలో లేని స్పెక్ట్రమ్ కొనుగోలు లేదా అమ్మకానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానంతో కాల్ డ్రాప్ సమస్యలు తగ్గనున్నాయి.
First Published:  9 Sep 2015 4:40 AM GMT
Next Story