Telugu Global
Others

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై హైకోర్టు సీరియస్‌!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేసిన ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి  ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు సభ్యుల చొప్పున రెండు కమిటీలు వేయాలని హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేసి బయటికి పంపించేశారని ఈ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి కేసును గతంలో కూడా విచారించిన హైకోర్టు ధర్మాసనం.. రిలీవ్ చేసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, తిరిగి […]

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యపై హైకోర్టు సీరియస్‌!
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేసిన ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించడానికి ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు సభ్యుల చొప్పున రెండు కమిటీలు వేయాలని హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేసి బయటికి పంపించేశారని ఈ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి కేసును గతంలో కూడా విచారించిన హైకోర్టు ధర్మాసనం.. రిలీవ్ చేసిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని, తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసింది. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఉన్నాయని గుర్తుచేస్తూ దీనిపై ఇరు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో చెప్పాలని ఆదేశించింది. ఇందుకోసం రెండు రాష్ట్రాలలో నలుగురు సభ్యుల చొప్పున రెండు కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా పూర్తి వివరాలను సేకరించి కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ముఖ్యంగా ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవ్ చేయడం, హైకోర్టు ఆదేశించిన తరువాత కూడా వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండు కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత, కమిటీల సూచనల మేరకు ఉద్యోగులకు తగిన సాయం చేయాలని హైకోర్టు సూచించింది. అనంతరం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
First Published:  9 Sep 2015 6:10 AM GMT
Next Story