Telugu Global
Cinema & Entertainment

తేజ అండ్ టీమ్ దేవుడి మీద భారం వేశారా..?

డైరెక్ట‌ర్ తేజ   ప్ర‌తిభావంత‌మైన టెక్నిషియ‌న్‌. ఈ విష‌యంలో  సందేహామే లేదు. ప్ర‌పంచంలో  అత్య‌త్తుమ‌మైన  నేష‌న‌ల్ జాగ్ర‌ఫి వంటి చానెల్ కు  కెమెరామెన్ కు ప‌నిచేసిన ప్రొఫైల్ ఉన్న ప‌ర్స‌న్. డైరెక్ట‌ర్ గా  త‌నేమిటో చిత్రం, నువ్వునేను, జ‌యం చిత్రాలు చెబుతాయి.  అయితే ఇప్పుడు తేజా గురించి చెప్ప‌డానికి ఏముంది..?  ద‌ర్శ‌కుడిగా  ల‌వ్ స్టోరీస్  మాత్ర‌మే చేస్తాడ‌నే స్టాంప్  ఉంది. ఈ స్టాంప్ ను తుడిచి వేయ‌డానికి చాల క‌ష్ట‌ప‌డుతున్నాడు. అలాగే త‌ను ద‌ర్శ‌కుడిగా బౌన్స్ బ్యాక్ కావ‌డానికి […]

తేజ అండ్ టీమ్ దేవుడి మీద భారం వేశారా..?
X

డైరెక్ట‌ర్ తేజ ప్ర‌తిభావంత‌మైన టెక్నిషియ‌న్‌. ఈ విష‌యంలో సందేహామే లేదు. ప్ర‌పంచంలో అత్య‌త్తుమ‌మైన నేష‌న‌ల్ జాగ్ర‌ఫి వంటి చానెల్ కు కెమెరామెన్ కు ప‌నిచేసిన ప్రొఫైల్ ఉన్న ప‌ర్స‌న్. డైరెక్ట‌ర్ గా త‌నేమిటో చిత్రం, నువ్వునేను, జ‌యం చిత్రాలు చెబుతాయి. అయితే ఇప్పుడు తేజా గురించి చెప్ప‌డానికి ఏముంది..? ద‌ర్శ‌కుడిగా ల‌వ్ స్టోరీస్ మాత్ర‌మే చేస్తాడ‌నే స్టాంప్ ఉంది. ఈ స్టాంప్ ను తుడిచి వేయ‌డానికి చాల క‌ష్ట‌ప‌డుతున్నాడు. అలాగే త‌ను ద‌ర్శ‌కుడిగా బౌన్స్ బ్యాక్ కావ‌డానికి కూడా అల్టిమెట్ గా వ‌ర్కువుట్ చేస్తున్నాడు.

తాజాగా దిలిప్ అనే కొత్త‌బ్బాయిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ.. హోరా హోరి పేరు తో చిత్రం చేస్తున్నారు. శుక్ర‌వారం రిలీజ్ కు సిద్ద‌మైన ఈ చిత్రం పై తేజ అంచ‌నాలు , ఆశ‌లు పెట్టుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. స్వ‌త‌హాగా చాల ప్రాక్టిక‌ల్ గా ఉండే తేజా మంగ‌ళ‌వారం హోరా హోరి టీమ్ ( హీరో, హీరోయిన్, కెమెరామెన్ ) ను తీసుకుని శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న ను సంద‌ర్శించుకోవ‌డానికి వెళ్లార‌ట‌. తేజ కెరీర్ లో ఇలా చేయ‌డం ఫ‌స్ట్ టైమ్ అంటున్నారు. త‌న వ‌ర్క్ పై త‌న‌కు న‌మ్మ‌కం ఒకింత ఎక్కువ ఉండే తేజ త‌న చిత్రం రిలీజ్ కు ముందు దేవుణ్ణి ద‌ర్శించుకోవ‌డానికి వెళ్ల‌డం న్యూస్ అయ్యింది. .. తేజ సినిమా స‌క్సెస్ ను దేవుడి పై భారం వేసిన‌ట్లున్నాడు అనే స‌ర‌దా కామెంట్స్ వినిపిస్తున్నాయి మ‌రి.

First Published:  9 Sep 2015 12:32 AM GMT
Next Story