Telugu Global
Others

పెట్టుబడులకు అద్భుత వేదిక భారత్‌: కేసీఆర్‌

కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామని, రెండు వారాల్లో అనుమతులు పొందే హక్కు పారిశ్రామికవేత్తలకు ఉండేలా ప్రత్యేక చట్టం రూపొందిందామని, ఇప్పటివరకు 56 కంపెనీలకు అనుమతులిచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దంన్నరపాటు పోరాడామని, అలాగని తమది వేర్పాటువాద వైఖరి కాదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైనందునే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి 15 నెలల క్రితం సాధించుకున్నామని, అప్పటి నుంచి ప్రజలు పూర్తి […]

పెట్టుబడులకు అద్భుత వేదిక భారత్‌: కేసీఆర్‌
X
కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామని, రెండు వారాల్లో అనుమతులు పొందే హక్కు పారిశ్రామికవేత్తలకు ఉండేలా ప్రత్యేక చట్టం రూపొందిందామని, ఇప్పటివరకు 56 కంపెనీలకు అనుమతులిచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దంన్నరపాటు పోరాడామని, అలాగని తమది వేర్పాటువాద వైఖరి కాదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైనందునే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి 15 నెలల క్రితం సాధించుకున్నామని, అప్పటి నుంచి ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో భాగంగా జరుగుతున్న సదస్సులో పాల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్… ‘ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్ రోడ్స్’ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర పాలన, దేశాభివృద్ధిపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
భారతదేశంలో రాష్ర్టాలది క్రియాశీలక పాత్రని, ప్రణాళిక సంఘం స్థానంలో నూతనంగా ఏర్పడిన నీతి ఆయోగ్ టీమిండియాలా పనిచేస్తుందని కేసీఆర్‌ తెలిపారు. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామని, రాష్ర్టాలకు కేంద్రం అధికంగా నిధులు, అధికారాలు ఇస్తుందని, ప్రధాని సంస్కరణల మార్గంలో పయనిస్తున్నారని, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గొప్ప విజయం సాధించారని ఆయన చెప్పారు. అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్‌లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువని, భారత్ ఇదే విధంగా ముందుకు వెళ్తుందన్న విశ్వాసం తమకుందని చెబుతూ పెట్టుబడులకు భారత్‌ మంచి వేదికగా భావించాలని ఆయన సమావేశానికి తెలిపారు.
First Published:  9 Sep 2015 5:26 AM GMT
Next Story