Telugu Global
National

మారియా..షీనా కేసు నుంచి మార‌రు

షీనా హ‌త్య కేసు ద‌ర్యాప్తును అంతా తానై న‌డిపిస్తున్న ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ రాకేశ్ మారియాను ప్ర‌మోష‌న్ పేరుతో త‌ప్పించిన ప్ర‌భుత్వం.. అన్నివ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో ఈ కేసును మారియాయే ప‌ర్య‌వేక్షిస్తార‌ని మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. షీనా బోరా కేసు రోజుకో మలుపు తిరుగుతున్నందు వల్ల , ఆ కేసు విచారణ పూర్తయి, నిందితులకు శిక్ష పడే వరకూ ఆ కేసు విచారణను పూర్తిగా మాజీ కమిషనర్ రాకేశ్ మారియా  ఆధ్వర్యంలోనే నడుస్తుందని మ‌హారాష్ర్ట హోంశాఖ‌ […]

మారియా..షీనా కేసు నుంచి మార‌రు
X
షీనా హ‌త్య కేసు ద‌ర్యాప్తును అంతా తానై న‌డిపిస్తున్న ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ రాకేశ్ మారియాను ప్ర‌మోష‌న్ పేరుతో త‌ప్పించిన ప్ర‌భుత్వం.. అన్నివ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో ఈ కేసును మారియాయే ప‌ర్య‌వేక్షిస్తార‌ని మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. షీనా బోరా కేసు రోజుకో మలుపు తిరుగుతున్నందు వల్ల , ఆ కేసు విచారణ పూర్తయి, నిందితులకు శిక్ష పడే వరకూ ఆ కేసు విచారణను పూర్తిగా మాజీ కమిషనర్ రాకేశ్ మారియా ఆధ్వర్యంలోనే నడుస్తుందని మ‌హారాష్ర్ట హోంశాఖ‌ అడిషిన‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ కేపీ బ‌క్షి ప్ర‌క‌టించారు. షీనా బోరా హ‌త్య‌కేసులో అత్యుత్సాహం చూపుతున్నార‌ని మారియాపై ఆరోప‌ణ‌లున్నాయి. త‌ర‌చూ ఖార్ స్టేష‌న్‌కు వెళ్లి నిందితుల‌ను స్వ‌యంగా మారియా విచారిస్తుండ‌డంపై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంద‌ని, ఇదే స‌మ‌యంలో ఇంద్రాణి త‌ర‌ఫు నుంచి రాజ‌కీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయ‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. దీనికి ఊత‌మిచ్చేలా ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న మారియాకు మ‌హారాష్ర్ట హోంగార్డు డైరెక్ట‌ర్‌గా ప్ర‌మోష‌న్ ఇచ్చి సాగ‌నంపే ప్ర‌య‌త్నాలు చేశార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనిపై మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం వివ‌ర‌ణ కూడా ఇస్తోంది. మారియా బ‌దిలీపై కొన్ని వారాలుగా చ‌ర్చించామ‌ని, ఇది ఇప్ప‌టికిప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని అడిషిన‌ల్ డైరెక్ట‌ర్ బ‌క్షి చెప్పారు . హోంగార్డ్స్ డైరెక్ట‌ర్ గా ఉంటూనే షీనాబోరా హ‌త్య‌కేసు ద‌ర్యాప్తును మారియా ప‌ర్య‌వేక్షిస్తార‌ని, కోర్టులో చార్జిషీట్ దాఖ‌లయ్యేంత‌వ‌ర‌కూ ఆయ‌న‌దే బాధ్య‌త‌ని ప్ర‌క‌టించారు. రాకేశ్ మారియా స్థానంలో ముంబై పోలీసు కొత్త క‌మిష‌న‌ర్‌గా అహ్మద్ జావెద్ నియమితుల‌య్యారు.
First Published:  9 Sep 2015 4:11 AM GMT
Next Story