Telugu Global
Others

కట్నం వేధింపులతో నవ వధువు ఆత్మహత్య

వరకట్నం దాహానికి మరో యువతి బలైపోయింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివశిస్తున్న కుటుంబంలో సుకన్య అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు యేడాది క్రితమే వివాహమైంది. శ్రీనివాస్‌, శకుంతల దంపతుల కుమార్తె సుకన్యకు మహేష్‌ అనే వ్యక్తితో గత యేడాది ఫిబ్రవరిలోనే వివాహం జరిగింది. జనవరిలో ఆమె గర్భవతి అని తెలిసింది. ఈ సమయంలో ఆమెకు భర్త నుంచి విపరీతమైన వేధింపులు ఉండేవని తెలిసింది. ఈ సమయంలోనే మహేష్‌ తమ్ముడి వివాహం జరగడం, అతని భార్య […]

కట్నం వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
X
వరకట్నం దాహానికి మరో యువతి బలైపోయింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో నివశిస్తున్న కుటుంబంలో సుకన్య అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు యేడాది క్రితమే వివాహమైంది. శ్రీనివాస్‌, శకుంతల దంపతుల కుమార్తె సుకన్యకు మహేష్‌ అనే వ్యక్తితో గత యేడాది ఫిబ్రవరిలోనే వివాహం జరిగింది. జనవరిలో ఆమె గర్భవతి అని తెలిసింది. ఈ సమయంలో ఆమెకు భర్త నుంచి విపరీతమైన వేధింపులు ఉండేవని తెలిసింది. ఈ సమయంలోనే మహేష్‌ తమ్ముడి వివాహం జరగడం, అతని భార్య కొంచెం ఎక్కువ కట్నం తెచ్చుకోవడంతో దాన్ని చూపించి అదనపు కట్నం కోసం మహేష్‌ వేధించడం మొదలు పెట్టాడని చెబుతున్నారు. వరకట్నం వేధింపులను తట్టుకోలేక గత ఏప్రిల్‌లో సుకన్య పుట్టింటికి వెళ్లిపోయిందని తెలిసింది. ఒక్కోసారి సుకన్యను మహేష్‌ కొడుతూ రాత్రిపూట బయటకి జట్టు పట్టుకుని ఈడ్చేసే వాడని తెలిసింది. అయితే ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె నిజాంపేటలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయిందని చెబుతున్నారు. మహేష్‌కు ఇంతకుముందే వివాహమైందని, ఇతను శాడిస్ట్‌ అని, ఇతన్ని భరించలేక తొలి భార్య పెళ్ళయిన ఆరు నెలలకే వదిలేసి వెళ్ళిపోయిందని, ఐదేళ్ళ తర్వాత విడాకులు రావడంతో మహేష్‌ మళ్ళీ సుకన్యను పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. సుకన్య తల్లిదండ్రులు ఆమె పెళ్ళి చేయడానికి చాలా కష్టపడ్డారని, అప్పు తెచ్చి ఘనంగా వివాహం జరిపించారని చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారు. మహేష్‌ ఆమెను బాగా వేధించేవాడని వారు ఆరోపించారు. శాడిస్టుగా బిహేవ్‌ చేసేవాడని వారన్నారు. కారణాలు తెలియకపోయినప్పటికీ సుకన్యకు అబార్షన్‌ అయ్యింది. ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కాగా సుకన్య తల్లి శకుంతల కుమార్తె మరణాన్ని తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భార్య ఆత్మహత్యపై స్పందిస్తూ దీనికి కారణం సుకన్య తల్లిదండ్రులేనని ఆరోపించారు. గర్భవతి అని తెలిసిన తర్వాత మూడు నెలలకే ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, వెళుతూ బంగారు నగలు, కొంత నగదు తీసుకుపోయిందని, ఇదంతా తల్లిదండ్రుల సూచనల మేరకే జరిగిందని ఆరోపించారు. తన భార్యను పంపించాల్సిందిగా లాయర్‌ నోటీసు కూడా ఇచ్చానని, అయినా ఆ వైపు నుంచి స్పందన లేదని ఆరోపించారు. తన భార్య సుకన్యకు అబార్షన్‌ చేయించిన విషయం కూడా తనకు తెలీదని, తన తమ్ముడు ఆ విషయాన్ని అడగడానికి వెళితే అతన్ని కూడా తిట్టి పంపించారని మహేష్‌ ఆరోపించాడు. తనతో 11 నెలలు మాత్రమే ఉందని, గర్భవతిగా ఉన్నందున తన వద్దకు వచ్చేయమని అనేకసార్లు అడిగానని, తల్లిదండ్రుల ఆమెతో తాను మాట్లాడకుండా ఉండేందుకు ఫోన్‌ కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించాడు. సుకన్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్టు తాను అదనపు కట్నం కోసం ఏనాడూ వేధించ లేదని వివరణ ఇచ్చాడు. తన నుంచి డబ్బులు రాబట్టేందుకే తల్లిదండ్రులు తన భార్యను దూరం చేశారని ఆరోపించాడు.
First Published:  9 Sep 2015 1:49 AM GMT
Next Story