Telugu Global
Others

ఇప్ప‌ట్లో ఇండో-పాక్ సీరిస్ లేన‌ట్లే!

స‌రిహ‌ద్దులో ఇరుదేశాల సైనికులు స‌మ‌ర‌భూమిలో త‌ల‌ప‌డితే.. అది యుద్ధం! ద్వైపాక్షిక సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగంగా రెండుదేశాల ఆట‌గాళ్లు మైదానంలో పోటీకి దిగితే.. దాని పేరే ఇండియా-పాక్ క్రికెట్ సీరిస్‌!  ప్ర‌పంచంలో ఏ రెండు దేశాల మ‌ధ్య ఇంత ఉత్కంఠ‌గా.. మ్యాచ్ జ‌రగ‌దు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌ను ఇండియా-పాక్ దేశాల ప్ర‌జ‌లే కాదు, క్రికెట్ ఆడే అన్ని దేశాలు అంతే ఉత్కంఠ‌గా వీక్షిస్తాయి. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు పెట్రేగిపోవ‌డంతో ఆ దేశంలో గ‌త ఆరేడేళ్లుగా ఎలాంటి […]

ఇప్ప‌ట్లో ఇండో-పాక్ సీరిస్ లేన‌ట్లే!
X
స‌రిహ‌ద్దులో ఇరుదేశాల సైనికులు స‌మ‌ర‌భూమిలో త‌ల‌ప‌డితే.. అది యుద్ధం! ద్వైపాక్షిక సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌లో భాగంగా రెండుదేశాల ఆట‌గాళ్లు మైదానంలో పోటీకి దిగితే.. దాని పేరే ఇండియా-పాక్ క్రికెట్ సీరిస్‌! ప్ర‌పంచంలో ఏ రెండు దేశాల మ‌ధ్య ఇంత ఉత్కంఠ‌గా.. మ్యాచ్ జ‌రగ‌దు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్‌ను ఇండియా-పాక్ దేశాల ప్ర‌జ‌లే కాదు, క్రికెట్ ఆడే అన్ని దేశాలు అంతే ఉత్కంఠ‌గా వీక్షిస్తాయి. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు పెట్రేగిపోవ‌డంతో ఆ దేశంలో గ‌త ఆరేడేళ్లుగా ఎలాంటి క్రికెట్ సీరీస్‌లు జ‌ర‌గడం లేదు. గ‌తంలో శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టుపై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు దిగారు. అప్ప‌టి నుంచి క్రికెట్ ఆడే ఏ దేశ‌మూ పాక్‌లో సీరిస్ ఆడేందుకు వెళ్ల‌డం లేదు. దీంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ జ‌ట్టు మ‌నుగ‌డ క‌ష్టంగా మారింది. చేసేదిలేక షార్జా మైదానాన్నే.. హోం గ్రౌండ్‌గా మార్చుకుంది.
సీరీస్ ఎందుకు ఆగిందంటే..!
ఏదేమైనా ఇండియా-పాక్‌ల మ‌ధ్య ముంద‌స్తుగా కుదిరిన ఒప్పందం ప్ర‌కారం.. ఇండియా-పాక్ దేశాల జ‌ట్లు 2015-23ల మ‌ధ్య ఆరు సీరిస్‌లు ఆడాలి. కానీ, ఇటీవ‌ల క‌శ్మీర్‌ స‌రిహ‌ద్దులో పాకిస్తాన్ ప‌దేప‌దే కాల్పుల విర‌మ‌ణ‌కు పాల్ప‌డ‌టం, ఉగ్ర‌వాదుల‌ను అక్ర‌మంగా పంప‌డం త‌దిత‌ర కార్య‌క‌లాపాల‌తో భార‌త్‌లో అస్థిర ప‌రిస్థితులు సృష్టించేందుకు ప్ర‌యత్నాలు సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ-పాక్‌తో ఎలాంటి సీరిస్‌లు ఆడేది లేద‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఒక‌వేళ ఆడాల‌న్నా బార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకోవాల‌ని మెలిక పెట్టింది. ఈ విష‌యంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ష‌హ‌ర్యార్ ఖాన్‌ను విలేక‌రులు క‌దిలించారు. దీంతో ఆయ‌న ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ముంద‌స్తుగా ఒప్పందం చేసుకుని బీసీసీఐ ఇప్పుడు కుద‌ర‌ద‌న‌డంపై మండిప‌డ్డారు. ఈ డిసెంబ‌రులో జ‌ర‌గాల్సిన సీరిస్ జ‌ర‌గ‌డం ప్ర‌శ్నార్థ‌కంగా మార‌డానికి బీసీసీఐ తీరే కార‌ణ‌మ‌న్నారు. బీసీసీఐతో ఆడ‌కుంటే మాకు మ‌నుగ‌డ లేద‌నుకుంటున్నారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య సీరిస్ జ‌రుగుతుంద‌ని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇరుదేశాల అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు.
First Published:  9 Sep 2015 12:04 AM GMT
Next Story