Telugu Global
Cinema & Entertainment

గెట్ టుగెదర్ లో  క‌ట్ట‌ప్ప పై చర్చించిన‌ జక్కన్న..

బాహుబ‌లి  ది బిగినింగ్ లో  క‌థ ప‌రంగా చెప్పుకుంటే.. క్యారెక్ట‌ర్ ల ప‌రిచ‌యం మాత్ర‌మే జ‌రిగింది.  బాహుబ‌లి, భ‌ళాల దేవ క‌ల‌సి పోరాడితే ఎలా వుంటుందో  మొద‌టి భాగం ఎండింగ్ లో చూపించారు. క‌ట్ చేస్తే.. సెకండ్ పార్ట్ లో వీరిద్ద‌రు ఎదురెద‌రు ప‌డి త‌ల‌ప‌డితే ఎలా వుంటుందో  ఆడియ‌న్స్ కు  చూపించాలి.  అస‌లు  ఏమి లేకుండా  విజువ‌ల్స్ తోనే  బాహుబ‌లి  మొద‌టి పార్ట్  అద‌ర గొట్టింది. విడుద‌లైన అన్ని చోట్ల‌.. క‌లెక్ష‌న్ల ప‌రంగా  దుమ్ము లేపి […]

గెట్ టుగెదర్ లో  క‌ట్ట‌ప్ప పై చర్చించిన‌ జక్కన్న..
X
బాహుబ‌లి ది బిగినింగ్ లో క‌థ ప‌రంగా చెప్పుకుంటే.. క్యారెక్ట‌ర్ ల ప‌రిచ‌యం మాత్ర‌మే జ‌రిగింది. బాహుబ‌లి, భ‌ళాల దేవ క‌ల‌సి పోరాడితే ఎలా వుంటుందో మొద‌టి భాగం ఎండింగ్ లో చూపించారు. క‌ట్ చేస్తే.. సెకండ్ పార్ట్ లో వీరిద్ద‌రు ఎదురెద‌రు ప‌డి త‌ల‌ప‌డితే ఎలా వుంటుందో ఆడియ‌న్స్ కు చూపించాలి. అస‌లు ఏమి లేకుండా విజువ‌ల్స్ తోనే బాహుబ‌లి మొద‌టి పార్ట్ అద‌ర గొట్టింది. విడుద‌లైన అన్ని చోట్ల‌.. క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము లేపి స‌రికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా స్టాండ‌ర్డ్ ను ప‌ది మెట్లు పైకీ తీసుకెళ్లింది.
ఇక తాజాగా రాజ‌మౌళి అండ్ టీమ్ సెకండ్ పార్ట్ కు సంబంధించి క‌థ‌లో కొన్ని ఇంప్రూవ్ మెంట్స్ కోసం త‌న టీమ్ తో మీటింగ్ పెట్టిన‌ట్లు తెలుస్తుంది. ఈ గెట్ టుగెదర్ లో క‌ట్ట‌ప్ప ..బాహుబ‌లి ని ఎందుకు పొడిచాడు..ఎందుకు పొడ‌వాల్సి వ‌చ్చింది అనే విష‌యాన్ని చ‌ర్చించిన‌ట్లు టాక్. మొద‌టి భాగం ఎండింగ్ లో క‌ట్ట‌ప్ప బాహుబ‌లి ని పొడ‌వ‌డం తో ఎండ్ చేసి..ఆడియ‌న్స్ ఊహాకు క‌థ‌ను వ‌దిలేశారు.. దానికి సరైన ముగింపు బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ లో ఎలా వుంటుందో అనే ఆస‌క్తి ని అద్భుతంగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి క్రియేట్ చేశారు. ఇక ఈ చిత్రం వ‌చ్చే యేడాది జూలై 10 న రిలీజ్ కావోచ్చు అనేది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. అంటే బాహుబ‌లి మొద‌టి భాగం వ‌చ్చిన సంవ‌త్స‌రానికి .. రెండో పార్ట్ రానుంద‌న్న‌మాట‌.
First Published:  8 Sep 2015 8:00 PM GMT
Next Story