Telugu Global
Others

రాకేశ్ మారియాను అందుకే మార్చారా?

షీనా బోరా హ‌త్య కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపారా?  మీడియా దృష్టిలో ప‌డేందుకు ప్రాథ‌మిక సూత్రాల‌ను గాలికొదిలేశారా? ఈ కార‌ణాలే  ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ రాకేశ్ మారియా బ‌దిలీకి కార‌ణ‌మ‌య్యాయా? అవున‌నే అంటోంది.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. షీనా బోరా హ‌త్య కేసుకు మీడియా మొద‌టి నుంచి ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చింది. పోలీసులూ అదే రీతిన ముందుకుసాగారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. అందుకే ఆయ‌న్ను ఉన్న‌ప‌లంగా బ‌దిలీ చేసింది. డీజీపీగా ప‌దోన్న‌తి క‌ల్పించినా.. […]

రాకేశ్ మారియాను అందుకే మార్చారా?
X
షీనా బోరా హ‌త్య కేసులో పోలీసులు అత్యుత్సాహం చూపారా? మీడియా దృష్టిలో ప‌డేందుకు ప్రాథ‌మిక సూత్రాల‌ను గాలికొదిలేశారా? ఈ కార‌ణాలే ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ రాకేశ్ మారియా బ‌దిలీకి కార‌ణ‌మ‌య్యాయా? అవున‌నే అంటోంది.. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం. షీనా బోరా హ‌త్య కేసుకు మీడియా మొద‌టి నుంచి ఎన‌లేని ప్రాధాన్యం ఇచ్చింది. పోలీసులూ అదే రీతిన ముందుకుసాగారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. అందుకే ఆయ‌న్ను ఉన్న‌ప‌లంగా బ‌దిలీ చేసింది. డీజీపీగా ప‌దోన్న‌తి క‌ల్పించినా.. దీనిపై మంగ‌ళ‌వారం దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమార‌మే రేగింది. కేసును బ‌ల‌హీన ప‌రిచే ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయ‌న్న ఊహాగానాలు చెల‌రేగాయి. దీంతో మ‌హా ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.
అస‌లు కార‌ణాలివే!
1. పోలీసులు కేసును మితిమీరిన వేగంతో ద‌ర్యాప్తు చేయ‌డం.
2. ద‌ర్యాప్తులో ప్రాథ‌మిక సూత్రాలు గాలికొదిలేయ‌డం.
3. ఫోరెన్సిక్ నివేదిక రాక‌ముందే అవ‌శేషాలు షీనావ‌ని ప్ర‌క‌టించడం.
4. షీనా బోరా హ‌త్య కేసు న‌మోదైన స్టేష‌న్‌కి వెళ్లి క‌మిష‌న‌ర్ రాకేశ్ మారియా స్వ‌యంగా ఇంద్రాణిని ప్ర‌శ్నించ‌డం.
5. గ‌తంలోనూ రాకేశ్ లండ‌న్ వెళ్లి ల‌లిత్ మోదీతో భేటీ అవ్వ‌డం.
6. ద‌ర్యాప్తు విష‌యాల‌ను గోప్యంగా ఉంచ‌క‌పోవ‌డం.
7. విచార‌ణ స‌మ‌యంలో జ‌రిగిన విష‌యాల‌ను మీడియాకు లీకులివ్వ‌డం.
8. సీఎం భద్ర‌త‌, న‌గ‌ర ర‌క్ష‌ణ కంటే ఈ కేసుకే మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వ‌డం.
First Published:  8 Sep 2015 11:56 PM GMT
Next Story