Telugu Global
Others

టీఆర్‌ఎస్‌ పక్కలో బల్లెంలా మారతా: రేవంత్‌

సింహానికి స్వేచ్ఛ లబించిందని, ఇక టీఆర్‌ఎస్‌ పార్టీని వెంటాడి వేటాడతానని తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సింహం సింగిల్‌గా హైదరాబాద్ వస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి చైనాకు వెళ్ళిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. ఇపుడు ‘మొదలైంది ఆట కాదని..వేట’ అని రేవంత్ అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాడని కేసీఆర్‌ను గెలిపిస్తే.. తాగుబోతుల తెలంగాణగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కొడంగల్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన ఆయనకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం ఏర్పాటు చేశారు. […]

టీఆర్‌ఎస్‌ పక్కలో బల్లెంలా మారతా: రేవంత్‌
X
సింహానికి స్వేచ్ఛ లబించిందని, ఇక టీఆర్‌ఎస్‌ పార్టీని వెంటాడి వేటాడతానని తెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సింహం సింగిల్‌గా హైదరాబాద్ వస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి చైనాకు వెళ్ళిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. ఇపుడు ‘మొదలైంది ఆట కాదని..వేట’ అని రేవంత్ అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాడని కేసీఆర్‌ను గెలిపిస్తే.. తాగుబోతుల తెలంగాణగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కొడంగల్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన ఆయనకు హైదరాబాద్‌లో ఘనస్వాగతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నేతలు రేవంత్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునే మహానగరం హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరికీ ఈ విషయం తెలుసునని, కేసీఆర్‌ మాత్రం తానేదో రాజధానిని అభివృద్ధి చేసినట్టు ప్రగల్బాలు పలుకుతున్నాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ను అందరూ దొర అంటారని, నిజానికి ఆయన దొర కాదని, దుర్మార్గుడని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది పిట్టల్లా రాలిపోతే, ఎంతో మంది ఆత్మాహుతికి పాల్పడితే… అలా కాలిపోతున్న దేహాల వాసనతో మదమెక్కిపోయాడని ఘాటైన పదజాలంతో రేవంత్‌ దుయ్యబట్టారు. ఏనాటికైనా టీఆర్‌ఎస్‌కు ఏకైక ప్రత్యమ్నాయం తెలుగుదేశం పార్టీయేనని, ఆ పార్టీని కూకటివేళ్ళతో పెకలించి వేసేది టీడీపీయేనని ఆయన అన్నారు. ఫాంహౌస్‌లో తన వంద ఎకరాల మీద ఉన్న మోజు నిత్యం పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతల కుటుంబంపై లేదని రేవంత్‌ ఆరోపించారు. బంగారు తెలంగాణగా రూపాంతరం చెందాల్సిన ఈ ప్రాంతంలో బతుకులు బరువుగా మారిపోయాయని ఆయన అన్నారు.
First Published:  9 Sep 2015 3:35 AM GMT
Next Story