Telugu Global
National

త్వరలో ఏడో వేతన సంఘం నివేదిక

వచ్చే యేడాది జనవరి నుంచి అమలు చేయాల్సి ఉన్న ఏడో వేతన సంఘం నివేదిక త్వరలో కేంద్ర ప్రభుత్వానికి చేరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత మొత్తం పెంచాలి? అన్న అంశమే ప్రధానంగా ఉండే ఈ నివేదిక కోసం దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడో పీఆర్సీలో వేతనాలు మూడింతలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మూల వేతనంలో డీఏతోపాటు హెచ్‌ఆర్‌ఏ, పిల్లల […]

త్వరలో ఏడో వేతన సంఘం నివేదిక
X
వచ్చే యేడాది జనవరి నుంచి అమలు చేయాల్సి ఉన్న ఏడో వేతన సంఘం నివేదిక త్వరలో కేంద్ర ప్రభుత్వానికి చేరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత మొత్తం పెంచాలి? అన్న అంశమే ప్రధానంగా ఉండే ఈ నివేదిక కోసం దాదాపు 48 లక్షల మంది ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడో పీఆర్సీలో వేతనాలు మూడింతలు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మూల వేతనంలో డీఏతోపాటు హెచ్‌ఆర్‌ఏ, పిల్లల విద్యా ఖర్చులతోపాటు భారీగా పెంచుతారని ఉద్యోగులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి పదేళ్లకొకసారి వేతన సవరణ జరుగుతుంది. ఏడో వేతన సంఘం ఈ ఏడాది నవంబర్‌ మొదటి వారంలో తన సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనుంది. వేతన సవరణకు గానూ ఆరో వేతన సంఘం అనుసరించిన విధానాలనే ఏడవ పీఆర్సీ కూడా ప్రాతిపదికన తీసుకున్నట్లు సమాచారం. ప్రతి ఏడాది జులై 1వ తేదీకి ఇంక్రిమెంట్‌, రెండు సార్లు డీఏల పెంపును పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి వేతన సంఘం తీపి కబురు ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది.
First Published:  9 Sep 2015 5:34 AM GMT
Next Story