Telugu Global
NEWS

గాంధీ ఆసుపత్రిలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ

గాంధీ ఆసుపత్రిలో మరో మహిళ స్వైన్‌ఫ్లూతో చేరింది. మెదక్‌ జిల్లాకు చెందిన గర్భిణి మరియమ్మకు స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో మరియమ్మను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరో ఇద్దరు అనుమానితుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని వైద్యపరీక్షలకు పంపించారు. వారికి కూడా స్వైన్‌ప్లూ ఉన్నట్టు తేలింది. తాజాగా ఇపుడు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మళ్లీ ఓ కేసు నమోదయినట్లు నోడల్ అధికారి డాక్టర్ నర్సింహులు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ […]

గాంధీ ఆసుపత్రిలో మరో మహిళకు స్వైన్‌ఫ్లూ
X
గాంధీ ఆసుపత్రిలో మరో మహిళ స్వైన్‌ఫ్లూతో చేరింది. మెదక్‌ జిల్లాకు చెందిన గర్భిణి మరియమ్మకు స్వైన్‌ఫ్లూ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో మరియమ్మను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరో ఇద్దరు అనుమానితుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని వైద్యపరీక్షలకు పంపించారు. వారికి కూడా స్వైన్‌ప్లూ ఉన్నట్టు తేలింది. తాజాగా ఇపుడు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మళ్లీ ఓ కేసు నమోదయినట్లు నోడల్ అధికారి డాక్టర్ నర్సింహులు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా, శంకరంపేట మండలం, గువ్వలపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ (26) నిండు గర్భిణి. అయితే ఈ నెల 2వ తేదిన గాంధీ ఆస్పత్రికి వచ్చి అడ్మిట్ అయ్యింది. దీంతో ఇక్కడి వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్సను నిర్వహించి పాపను బయటకు తీశారు. అయితే మరియమ్మకు స్వైన్ ప్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షల కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించగా ఆమెకు స్వైన్ ప్లూ పాజిటీవ్‌గా తేలింది. దీంతో ఆమెకు స్వైన్ ఫ్లూకు సంబంధించిన చికిత్సను అందిస్తున్నట్లు నోడల్ అధికారి నర్సింహులు తెలిపారు. స్వైన్‌ఫ్లూ రోగులకు అందించాల్సిన వైద్యంపై డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
First Published:  9 Sep 2015 12:28 AM GMT
Next Story