Telugu Global
NEWS

తోటపల్లి ప్రాజెక్టు నేడు జాతికి అంకితం

ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి పుష్కర సమయం పట్టింది. దశాబ్ద కాలంగా ఆటుపోట్లు ఎదుర్కున్న తోటపల్లి ప్రాజెక్టును నేడు(గురువారం) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేయనున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్షా 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు తోటపల్లి ప్రాజెక్టును ఉద్దేశించారు. 2.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్‌కు 2003లో ముఖ్యమంత్రి […]

తోటపల్లి ప్రాజెక్టు నేడు జాతికి అంకితం
X
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి పుష్కర సమయం పట్టింది. దశాబ్ద కాలంగా ఆటుపోట్లు ఎదుర్కున్న తోటపల్లి ప్రాజెక్టును నేడు(గురువారం) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేయనున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్షా 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు తోటపల్లి ప్రాజెక్టును ఉద్దేశించారు. 2.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్‌కు 2003లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడే శంకుస్థాపన చేశారు. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులు వేగం తగ్గాయి. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో అలసత్వం కారణంగా నిర్మాణ వేగం మందగించింది. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఓ దశలో ప్రశ్నార్థకమైంది. నిర్వాసితులు పోరుబాట పట్టడంతో పలుమార్లు లాఠీచార్జిలో చేయాల్సి వచ్చింది. ఆలస్యమవుతూ రావడంతో ప్రాజెక్టు వ్యయం రూ. 450 నుంచి రూ.774 కోట్లకు చేరుకుంది. చంద్రబాబు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో పెండింగ్ పనులు మొత్తం యుద్ధ ప్రాతిపదికన పూర్తి అయ్యి ఇపుడు రైతుల చెంతకు నీరు చేరే పరిస్థితి తలెత్తింది.
First Published:  9 Sep 2015 5:12 AM GMT
Next Story