Telugu Global
Cinema & Entertainment

లారెన్స్‌కు మెగాస్టార్‌ నుంచి పిలుపు!

కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత దర్శకుడిగా మారి అనేక హిట్ సినిమాలను తీశాడు. అంతేకాక తాను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా మంచి పేరునే సంపాదించాడు. అతనికి సమయం లేకపోవటం వలన బయటి సినిమాలకు కొరియోగ్రాఫి చేయటం మానేశాడు. అయితే మెగా కాంపౌండ్ నుండి పిలుపు రావటంతో,  అన్నయ్య అని పిలిచే చిరు ముందు వాలిపోయాడు. ఇంతకీ లారెన్స్‌ వచ్చింది చిరు 150వ సినిమాకి స్టెప్పులు నేర్పడానికి […]

లారెన్స్‌కు మెగాస్టార్‌ నుంచి పిలుపు!
X
కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత దర్శకుడిగా మారి అనేక హిట్ సినిమాలను తీశాడు. అంతేకాక తాను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా మంచి పేరునే సంపాదించాడు. అతనికి సమయం లేకపోవటం వలన బయటి సినిమాలకు కొరియోగ్రాఫి చేయటం మానేశాడు. అయితే మెగా కాంపౌండ్ నుండి పిలుపు రావటంతో, అన్నయ్య అని పిలిచే చిరు ముందు వాలిపోయాడు. ఇంతకీ లారెన్స్‌ వచ్చింది చిరు 150వ సినిమాకి స్టెప్పులు నేర్పడానికి కాదు. రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’లో చిరు, రామ్ చరణ్ కలిసి చిందులేసే పాటలో ఇలియానాకి స్టెప్పులున్నాయి. ఆ పాటకు కొరియోగ్రఫీ చేయమని చిరు చెప్పటంతో తమ్ముడు లారెన్స్ కాదనలేక పోయాడట. ఈ పాట హిందీ సాంగ్ ‘కజరారే…కజరారే…’ టైప్‌లో ఉంటుందని సమాచారం. బ్రూస్‌లీకి చిరు డాన్స్ ప్రాక్టిస్ కూడా మొదలు పెట్టేసాడు. మెగాస్టార్‌ స్టెప్పుల కోసం చాలాకాలంగా పడిగాపులు కాస్తున్న అభిమానులకు లారెన్స్ కొరియో గ్రఫీ భలే కిక్కు ఇస్తుందనడంలో నో డౌట్‌. పైగా ‘బ్రూస్ లీ’ కి చిరు, లారెన్స్‌ ప్లస్ అవుతారని చెప్పడంలో సందేహం లేదు.
First Published:  9 Sep 2015 9:00 PM GMT
Next Story