Telugu Global
National

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కాంగ్రెస్‌ 'నో'

జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి చుక్కెదురైంది. వర్షాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా లలిత్‌గేట్‌ వ్యవహారంతో ఒక్క బిల్లు కొలిక్కిరాలేదు. దీంతో జీఎస్‌టీ బిల్లుకోసం ప్రత్యేక భేటీని నిర్వహించాలన్న ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలను ప్రొరోగ్‌ చేయలేదు. జీఎస్‌టీ బిల్లు కోసం ప్రభుత్వం తెరవెనక మంత్రాంగం నడిపినా ఫలితం కనిపించలేదు. జీఎస్‌టీ బిల్లుపై కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయపార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే బీజేపీ నేతల […]

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కాంగ్రెస్‌ నో
X
జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలనుకున్న ప్రభుత్వానికి చుక్కెదురైంది. వర్షాకాల సమావేశాల్లో జీఎస్‌టీ బిల్లును తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా లలిత్‌గేట్‌ వ్యవహారంతో ఒక్క బిల్లు కొలిక్కిరాలేదు. దీంతో జీఎస్‌టీ బిల్లుకోసం ప్రత్యేక భేటీని నిర్వహించాలన్న ఉద్దేశంతో పార్లమెంటు సమావేశాలను ప్రొరోగ్‌ చేయలేదు. జీఎస్‌టీ బిల్లు కోసం ప్రభుత్వం తెరవెనక మంత్రాంగం నడిపినా ఫలితం కనిపించలేదు. జీఎస్‌టీ బిల్లుపై కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయపార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే బీజేపీ నేతల వ్యవహారశైలి కారణంగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్‌ గండి కొట్టింది. జీఎస్‌టీ బిల్లుపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా లేదా ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మాట్లాడకుండా ఆజాద్‌, మల్లికార్జున ఖర్గేలతో మంతనాలు జరిపారు. దీంతో ప్రత్యేక సమావేశాలకు సోనియా, రాహుల్‌ సమ్మతించలేదు.
First Published:  10 Sep 2015 2:44 AM GMT
Next Story