Telugu Global
Cinema & Entertainment

ఘట్టమనేని మనం

అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి తీసిన మనం సినిమా ఎంత హిట్టయిందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, ఇక లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు వాళ్ల పాత్రల్లో అలా ఇమిడిపోయారు. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఇప్పుడు మిగతా హీరోల దృష్టి కూడా అలాంటి సినిమాలపై పడింది. మరీ ముఖ్యంగా ఘట్టమనేని వంశానికి చెందిన హీరోలు ఈ తరహా కథలో నటించాలని అనుకుంటున్నారు. కృష్ణ, మహేష్, గౌతమ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అంతా కోరుకుంటున్నారు. […]

ఘట్టమనేని మనం
X
అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలిసి తీసిన మనం సినిమా ఎంత హిట్టయిందో మనందరికీ తెలుసు. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, ఇక లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు వాళ్ల పాత్రల్లో అలా ఇమిడిపోయారు. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఇప్పుడు మిగతా హీరోల దృష్టి కూడా అలాంటి సినిమాలపై పడింది. మరీ ముఖ్యంగా ఘట్టమనేని వంశానికి చెందిన హీరోలు ఈ తరహా కథలో నటించాలని అనుకుంటున్నారు. కృష్ణ, మహేష్, గౌతమ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అంతా కోరుకుంటున్నారు. గతంలో కృష్ణ సినిమాల్లో మహేష్ కనిపించాడు. మహేష్ సినిమాలో కూడా కృష్ణ కనిపించారు. అలాగే మహేష్ నటించిన వన్-నేనొక్కడినేలో గౌతమ్ కనిపించాడు. కానీ ముగ్గురూ కలిసి చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. ఆ లోటు తీర్చేందుకు ముగ్గురు కలిసుండే కథను ఓ స్టార్ డైరక్టర్ సిద్ధం చేశాడట. ప్రస్తుతం ఈ పనిమీదే మహేష్ కథాచర్చల్లో ఉన్నాడని తెలుస్తోంది. సినిమా స్క్రీన్ ప్లే కనుక ఓకే అయితే.. బ్రహ్మోత్సవం తర్వాత సెట్స్ పైకి వెళ్లేది ఈ ఫ్యామిలీ చిత్రమే అవుతుంది.
First Published:  10 Sep 2015 7:00 PM GMT
Next Story