Telugu Global
Cinema & Entertainment

సమంతకు అక్కడేం పని?

టాలీవుడ్-కోలీవుడ్ లో రేసుగుర్రంలా దూసుకుపోతోంది సమంత. స్టార్ హీరోలందరితీ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అసలు ఆమె కాల్షీట్ దొరకడమే దుర్బభం అయిపోయిందిప్పుడు. అలాంటి సమంత సడెన్ గా ఖైరతాబాద్ లో ప్రత్యక్షమైంది. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. సమంతకు అక్కడేం పనంటూ ఆరా తీశారు. నిజానికి సమంత ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చింది. కొత్తగా కొనుక్కున్న బీఎండబ్ల్యూ 5-సిరీస్ లగ్జరీ కారును తన పేరుపై రిజిస్టర్ చేయించుకునేందుకు స్వయంగా ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చింది […]

సమంతకు అక్కడేం పని?
X
టాలీవుడ్-కోలీవుడ్ లో రేసుగుర్రంలా దూసుకుపోతోంది సమంత. స్టార్ హీరోలందరితీ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అసలు ఆమె కాల్షీట్ దొరకడమే దుర్బభం అయిపోయిందిప్పుడు. అలాంటి సమంత సడెన్ గా ఖైరతాబాద్ లో ప్రత్యక్షమైంది. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. సమంతకు అక్కడేం పనంటూ ఆరా తీశారు. నిజానికి సమంత ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చింది. కొత్తగా కొనుక్కున్న బీఎండబ్ల్యూ 5-సిరీస్ లగ్జరీ కారును తన పేరుపై రిజిస్టర్ చేయించుకునేందుకు స్వయంగా ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చింది సమంత. అంతేకాదు.. తనకు ఎంతో ఇష్టమైన 3888 ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా 26వేల 5వందల రూపాయలు ఎక్స్ ట్రా కట్టి మరీ నంబర్ ప్లేట్ దక్కించుకుంది. సమంత రాకతో ఆర్టీఏ ఆఫీస్ లో ఒక్కసారిగా సందడి నెలకొంది. అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.
First Published:  10 Sep 2015 7:02 PM GMT
Next Story