Telugu Global
Others

అమెరికా గాయానికి 14 ఏళ్లు!

అది 2001, సెప్టెంబరు 11, మంగ‌ళ‌వారం ఉద‌యం న్యూయార్క్ న‌గ‌రంలో ఆ రోజు అల్‌ఖైదా సృష్టించిన ఘోర క‌లి నేటికీ అమెరికా వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. విమానాల‌నే బాంబులుగా ఉప‌యోగించి చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎర‌గ‌ని విధంగా అమెరికాపై విరుచుకుప‌డింది అల్‌ఖైదా. అగ్ర‌రాజ్యం అని చెప్పుకునే దేశాన్ని వ‌రుస‌దాడుల‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. అమెరికా అధ్య‌క్షుడినే అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. తీవ్ర‌వాదులు తొలుత తాము హైజాగ్ చేసిన  రెండు విమానాలతో అమెరికా ఆర్థిక‌రంగానికి గుండెకాయ‌గా చెప్పుకునే.. న్యూయార్క్ నగరంలోని ప్రపంచ […]

అమెరికా గాయానికి 14 ఏళ్లు!
X
అది 2001, సెప్టెంబరు 11, మంగ‌ళ‌వారం ఉద‌యం న్యూయార్క్ న‌గ‌రంలో ఆ రోజు అల్‌ఖైదా సృష్టించిన ఘోర క‌లి నేటికీ అమెరికా వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. విమానాల‌నే బాంబులుగా ఉప‌యోగించి చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎర‌గ‌ని విధంగా అమెరికాపై విరుచుకుప‌డింది అల్‌ఖైదా. అగ్ర‌రాజ్యం అని చెప్పుకునే దేశాన్ని వ‌రుస‌దాడుల‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. అమెరికా అధ్య‌క్షుడినే అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. తీవ్ర‌వాదులు తొలుత తాము హైజాగ్ చేసిన రెండు విమానాలతో అమెరికా ఆర్థిక‌రంగానికి గుండెకాయ‌గా చెప్పుకునే.. న్యూయార్క్ నగరంలోని ప్రపంచ వాణిజ్య సంస్థ(డ‌బ్లూ.టీ.ఓ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ D.Cకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్‌పైకి వదిలారు. గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. విమానాల్లో ప్రయాణించిన ఏ ఎక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. మాన‌వ‌బాంబులుగా మారిన 19 మంది అల్‌ఖైదా తీవ్ర‌వాదులు ఈ దాడిలో పాల్గొన్నారు. దాడిలో దాదాపు 2,996 మంది మ‌ర‌ణించారు. వీరిలో 19 మంది తీవ్ర‌వాదులు కూడా ఉన్నారు.
దాడి త‌రువాత అమెరికా సాధించింది ఏంటి?
ఈ దాడి త‌రువాత తీవ్ర‌వాదాన్ని అంత‌మొందిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేసిన అమెరికా ప్ర‌పంచ‌శాంతికి ఏం సాధించిందంటే.. ఆ దేశం వ‌ద్ద ఎలాంటి స‌మాధానం లేదు. అమెరికా గుండెల‌పై అల్‌ఖైదా చేసిన గాయం నేటీకీ స‌లుపుతూనే ఉంది. ఉగ్ర‌వాదం పేరు చెబితేనే ఉలిక్కి ప‌డుతోంది. అందుకే మ‌ధ్య‌ప్రాచ్యంతోపాటు, ఉత్త‌ర‌ ఆఫ్రికా దేశాల్లో తీవ్ర‌వాదులు ఉన్నా..లేకున్నా ప్ర‌పంచ‌శాంతి చ‌ర్య‌ల పేరిట‌ వైమానిక దాడులకు పాల్ప‌డుతూ మ‌రింత న‌ర‌మేథానికి పాల్ప‌డుతోంది. అఫ్ట‌నిస్తాన్‌తో మొద‌లైన అమెరికా వేట‌, త‌రువాత ఇరాక్‌, సిరియా, యెమెన్ త‌దిత‌ర ముస్లిం దేశాల‌కు విస్త‌రించింది. ఈ దాడుల‌కు సూత్ర‌ధారులుగా చెబుతున్న ఒసామాబిన్‌లాడెన్ను అమెరికా చివ‌ర‌కు మిత్ర‌దేశ‌మైన పాకిస్తాన్‌లో ఆ దేశానికే తెలియ‌కుండా రహస్య ఆప‌రేష‌న్ ద్వారా 2011, మే 2న మ‌ట్టుబెట్ట‌డం కొస‌మెరుపు. ఇంత‌వ‌ర‌కూ అమెరికా తీవ్ర‌వాదం, అణ్వాయుధం త‌దిత‌ర కార‌ణాలు చూపి దాడుల‌కు పాల్ప‌డ్డ ఏ దేశంలోనూ వారు సాధించింది ఏమీ లేదు! కొండ‌ను త‌వ్వి ఎల‌క‌ను ప‌ట్టిన చందంగా ఉన్నాయి అమెరికా చ‌ర్య‌లు. ప్ర‌పంచ‌శాంతి పేరిట యుద్ధోన్మాది అమెరికా చేప‌డుతున్న చ‌ర్య‌లు ముస్లిం దేశాలలో రాజ‌కీయ అస్థిర‌త్వానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.
First Published:  10 Sep 2015 11:43 PM GMT
Next Story