Telugu Global
Others

ఢిల్లీ వర్శిటీలో ఏబీవీపీ హవా!

ఢిల్లీ యూనివర్సిటీ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఘన విజయం సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. విద్యార్థులందరూ తమవైపే ఉన్నారని ఢంకా బజాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూశాయి. యూనివర్సిటీ ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏపీవీపీ) భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. డీయూఎస్‌యూ (ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్) అధ్యక్షుడిగా సతిందర్ అవనా గెలుపొందగా, సన్నీ […]

ఢిల్లీ వర్శిటీలో ఏబీవీపీ హవా!
X
ఢిల్లీ యూనివర్సిటీ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఘన విజయం సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. విద్యార్థులందరూ తమవైపే ఉన్నారని ఢంకా బజాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చవిచూశాయి. యూనివర్సిటీ ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏపీవీపీ) భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. డీయూఎస్‌యూ (ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్) అధ్యక్షుడిగా సతిందర్ అవనా గెలుపొందగా, సన్నీ దేధ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంజలీ రాణా, ఛత్రపాల్ యాదవ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. మొత్తం 35 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడగా.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ, ఆప్ విద్యార్థి విభాగం ఛాత్ర యువ సంఘర్ష్ సమితి(సీవైఎస్ఎస్) ఓటమి పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో లక్షా 35 వేల మంది విద్యార్థులు ఓట్లు వేశారు. ఎన్ఎస్‌యూఐ రెండో రౌండ్‌లో తిరుగుముఖం పట్టగా.. సీవైఎస్ఎస్ ఎలాంటి ప్రభావం చూపలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసి కొన్ని నెలలైనా గడవక ముందే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాపులారీటీ తగ్గిపోయినట్లు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు తెలియజేస్తున్నాయి. విద్యార్థుల ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ రెండోస్థానంలోను, ఆప్‌ విద్యార్థి సంఘం మూడో స్థానంలోను నిలబడ్డాయి. యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించడంతో బీజేపీ అగ్రనేతలు, ఏబీవీపీ నేతలపై అభినందనల వర్షం కురిపించారు. ఏబీవీపీ నేతలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం ఏబీవీపీ నేతలను అభినందించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసి ఘన విజయం సాధించింది.
First Published:  12 Sep 2015 6:22 AM GMT
Next Story