Telugu Global
Others

కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో... ఇద్దరు మృతి

కర్ణాటకలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు నేలకు ఒరిగిపోయింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని వాడి- గుల్బర్గా రైల్వేస్టేషన్ల మధ్య మార్టూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు రైలు బోగీలు ధ్వంసం అయ్యాయి. సికింద్రాబాద్‌ నుంచి ముంబయి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆంబులెన్సుల […]

కర్ణాటకలో పట్టాలు తప్పిన దురంతో... ఇద్దరు మృతి
X
కర్ణాటకలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు నేలకు ఒరిగిపోయింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని వాడి- గుల్బర్గా రైల్వేస్టేషన్ల మధ్య మార్టూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నాలుగు రైలు బోగీలు ధ్వంసం అయ్యాయి. సికింద్రాబాద్‌ నుంచి ముంబయి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆంబులెన్సుల ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్-ముంబై ఎల్టీటీ దురంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి 11.05 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. బయలుదేరిన మూడు గంటలకే పట్టాలు తప్పింది. షాహాబాద్ రైల్వే స్టేషన్ దాటిన కొద్దిసేపటికే మార్టురు వద్ద వేగంగా వెళుతున్న ఈ రైలు పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో గంటకు 110 కిమీ వేగంలో రైలు నడుస్తుందని అధికారులు చెప్పారు. తెల్లవారుజామున 2.15 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.
First Published:  11 Sep 2015 11:42 PM GMT
Next Story