Telugu Global
Cinema & Entertainment

  తిరుపతిలో మహేష్ బ్రహ్మోత్సవం

శ్రీమంతుడు సక్సెస్ తర్వాత ఫారిన్ చెక్కేశాడు మహేష్. ఫ్యామిలీతో కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నాడు. తిరిగి ఈమధ్యే హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన వెంటనే బ్రహ్మోత్సవం సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రిన్స్. ఇందులో భాగంగా ఈనెల 16 నుంచే బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ పైకి రానుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ను తిరుపతిలో ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. పైగా టైటిల్ కు తగ్గట్టు, […]

  తిరుపతిలో మహేష్ బ్రహ్మోత్సవం
X
శ్రీమంతుడు సక్సెస్ తర్వాత ఫారిన్ చెక్కేశాడు మహేష్. ఫ్యామిలీతో కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకున్నాడు. తిరిగి ఈమధ్యే హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన వెంటనే బ్రహ్మోత్సవం సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రిన్స్. ఇందులో భాగంగా ఈనెల 16 నుంచే బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ పైకి రానుంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ను తిరుపతిలో ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. పైగా టైటిల్ కు తగ్గట్టు, కొన్ని సన్నివేశాల్ని తిరుపతిలో చిత్రీకరించాల్సి ఉంది. అందుకే బ్రహ్మోత్సవం ఫస్ట్ షెడ్యూల్ ను తిరుపతిలోనే ప్లాన్ చేశారు. ఈనెల 16 నుంచి తిరుపతిలో జరిగే షూటింగ్ లో మహేష్ పాల్గొంటాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్, ప్రణీత, సమంత హీరోియన్లుగా నటిస్తారు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చనున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న బ్రహ్మోత్సవం సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
First Published:  12 Sep 2015 7:06 PM GMT
Next Story