Telugu Global
Others

మంత్రిని, ఎంపీని తరిమేసిన బందరు పోర్టు రైతులు!

‘నెత్తీనోరు మొత్తుకుంటున్నా మళ్ళీ మళ్ళీ వచ్చి మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తారా… అసలు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం’ అంటూ మంత్రిని, మరో ఎంపీని నిలదీశారు బందరు పోర్టు ప్రాంతంలోని రైతులు. ‘అది చేస్తాం… ఇది చేస్తాం… అంటూ హామిలిచ్చి భూములు లాక్కుని బడాబాబులకు కట్టబెట్టి మా బతుకులు బుగ్గి చేస్తారా’ అంటూ నిలదీశారు. ‘ఇంకోసారి ఇక్కడకు వచ్చారంటే ఏం చేస్తామో మాకే తెలీదు… మంత్రులే కాదు, అధికారులు వచ్చినా ఊరుకోం. అధికారపార్టీకి చెందిన ఎవరు […]

మంత్రిని, ఎంపీని తరిమేసిన బందరు పోర్టు రైతులు!
X
‘నెత్తీనోరు మొత్తుకుంటున్నా మళ్ళీ మళ్ళీ వచ్చి మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తారా… అసలు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం’ అంటూ మంత్రిని, మరో ఎంపీని నిలదీశారు బందరు పోర్టు ప్రాంతంలోని రైతులు. ‘అది చేస్తాం… ఇది చేస్తాం… అంటూ హామిలిచ్చి భూములు లాక్కుని బడాబాబులకు కట్టబెట్టి మా బతుకులు బుగ్గి చేస్తారా’ అంటూ నిలదీశారు. ‘ఇంకోసారి ఇక్కడకు వచ్చారంటే ఏం చేస్తామో మాకే తెలీదు… మంత్రులే కాదు, అధికారులు వచ్చినా ఊరుకోం. అధికారపార్టీకి చెందిన ఎవరు వచ్చిన నిర్భంధిస్తాం’ అంటూ హెచ్చరించి అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. ‘బంగారంలా మూడు పంటలు పండే భూములు లాక్కుని పారిశ్రామికవేత్తలకు కట్టబెడితే మేము చూస్తూ ఉండాలా… అసలు ఏమనుకుంటున్నారు…’ అంటూ దాడి చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన మంత్రి పి.ఏ. హరిబాబుకు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనలో హరిబాబుకు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. పరిస్థితిని గ్రహించిన మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణ పరిస్థితిని అర్ధం చేసుకుని కాలికి బుద్ధి చెప్పారు.
బందరు పోర్టుకు భూ సేకరణ పేరుతో ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసి భూముల స్వాధీనానికి సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో రైతులు తిరగబడ్డారు. తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని, బలవంతంగా లాక్కుంటే తిరగబడక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మద్దతుతో రైతులకు కొత్తబలం వచ్చింది. పవన్‌ ప్రవేశంతో నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినప్పటికీ అధికారపార్టీ నేతలను, మంత్రులను, అధికారులను పంపించి నచ్చజెప్పే పేరుతో రైతులను పరోక్షంగా వేధింపులకు గురి చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని బందరు మండలంలోని కోన గ్రామ రైతులు హెచ్చరిస్తున్నారు.
First Published:  13 Sep 2015 12:21 AM GMT
Next Story