Telugu Global
Others

హైదరాబాద్‌లో రోడ్లు మాయం..!

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్ట్‌వల్ల రోడ్లు ఇరుకైపోయాయి. ఎల్‌అండ్‌టి సంస్థ అడ్డగోలుగా రోడ్లను ఆక్రమించేసింది. మెట్రోరైలు ప్రాజెక్ట్‌ పనులైతే చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నారని అందరూ ఎల్‌అండ్‌టిని మెచ్చుకుంటున్నారు. అయితే ఎల్‌అండ్‌టి నిర్వహించాల్సిన తాత్కాలిక రోడ్డు పనులు, ఎల్‌అండ్‌టి పనుల వలన పాడైపోయిన రోడ్లను రిపేరు చేస్తున్న విధానం చాలా నాసిరకంగా ఉంటున్నాయి. ఎల్‌అండ్‌టి సంస్థ ఈరోజు వేసిన రోడ్డుకి రెండుమూడురోజులకే గుంటలు పడుతున్నాయి. మన కాంట్రాక్టర్లు చేసే పనులే ఎల్‌అండ్‌టి కన్నా బాగుంటున్నాయంటున్నారు. దీంతో హైదరాబాద్‌ […]

హైదరాబాద్‌లో రోడ్లు మాయం..!
X

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్ట్‌వల్ల రోడ్లు ఇరుకైపోయాయి. ఎల్‌అండ్‌టి సంస్థ అడ్డగోలుగా రోడ్లను ఆక్రమించేసింది. మెట్రోరైలు ప్రాజెక్ట్‌ పనులైతే చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నారని అందరూ ఎల్‌అండ్‌టిని మెచ్చుకుంటున్నారు. అయితే ఎల్‌అండ్‌టి నిర్వహించాల్సిన తాత్కాలిక రోడ్డు పనులు, ఎల్‌అండ్‌టి పనుల వలన పాడైపోయిన రోడ్లను రిపేరు చేస్తున్న విధానం చాలా నాసిరకంగా ఉంటున్నాయి. ఎల్‌అండ్‌టి సంస్థ ఈరోజు వేసిన రోడ్డుకి రెండుమూడురోజులకే గుంటలు పడుతున్నాయి. మన కాంట్రాక్టర్లు చేసే పనులే ఎల్‌అండ్‌టి కన్నా బాగుంటున్నాయంటున్నారు. దీంతో హైదరాబాద్‌ ప్రధాన రహదారులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ఎల్‌అండ్‌టి హింసతో నానా బాధలు పడుతున్న నగర ప్రజలకు వినాయక మండపాల పేరుతో కొత్త హింస మొదలైంది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన ఉత్సాహమో, హిందూ మత సంస్థల అత్యుత్సాహమో తెలియదుగాని ఎప్పుడు లేనిది ఈ ఏడాది వినాయక చవితికి పదిరోజుల ముందే కాలనీలలో ప్రధాన రోడ్లను ఆక్రమించి మండపాలకు స్ట్రక్చర్లు కట్టేసారు.
ప్రధాన రహదారుల్లో నానా బాధలుపడి కాలనీల్లోకి వస్తే అక్కడా వాహనాల్లో నేరుగా మన ఇంటికి పోలేనిస్థితి. ఇన్ని రోజులు ముందుగా రోడ్లను ఇలా అడ్డదిడ్డంగా ఆక్రమించేందుకు అనుమతి ఎవరు ఇచ్చారో ఆ వినాయకుడికే తెలియాలి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా ఎప్పుడు చేస్తారో తెలీదుగాని ఇప్పుడు ఉన్న రోడ్లను ప్రజలకు వాడుకునే వీలు కల్పిస్తే ఈ ప్రభుత్వానికి, పోలీసులకు ప్రజలు రుణపడి ఉంటారు.

First Published:  13 Sep 2015 3:10 AM GMT
Next Story