Telugu Global
Cinema & Entertainment

నాగశౌర్యను పక్కనపెట్టిన టీవీ9

అవును.. టీవీ9 న్యూస్ ఛానెల్ నాగశౌర్యను పక్కనపెట్టింది. ఈ ఛానెల్ ఇప్పటికే సినిమా నిర్మాణంలోకి ఎంటరైంది. పేరు టీవీ9 అని కనిపించకపోయినప్పటికీ కొన్ని సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించింది. త్వరలోనే ఈ ఛానెల్ మరో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మధుర శ్రీధర్ సహ-నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకు రామరాజు దర్శకుడు. గతంలో ఈ దర్శకుడు మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు అనే ఆర్ట్ సినిమాను తీశాడు. జ్యోతిలక్ష్మి మూవీలో చార్మి సరసన నటించిన సత్యను ఈ […]

నాగశౌర్యను పక్కనపెట్టిన టీవీ9
X
అవును.. టీవీ9 న్యూస్ ఛానెల్ నాగశౌర్యను పక్కనపెట్టింది. ఈ ఛానెల్ ఇప్పటికే సినిమా నిర్మాణంలోకి ఎంటరైంది. పేరు టీవీ9 అని కనిపించకపోయినప్పటికీ కొన్ని సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించింది. త్వరలోనే ఈ ఛానెల్ మరో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మధుర శ్రీధర్ సహ-నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాకు రామరాజు దర్శకుడు. గతంలో ఈ దర్శకుడు మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు అనే ఆర్ట్ సినిమాను తీశాడు. జ్యోతిలక్ష్మి మూవీలో చార్మి సరసన నటించిన సత్యను ఈ సినిమాలో హీరోగా ఎంపిక చేసుకున్నారు. అయితే అదే టైమ్ లో హీరో నాగశౌర్య, వ్యక్తిగతంగా వెళ్లి నిర్మాతలతో మాట్లాడాడు. తనకు ఆ సినిమా ఛాన్స్ ఇప్పించమని కోరాడు. నిజానికి సత్యతో పోలిస్తే నాగశౌర్యకే మైలేజీ ఎక్కువగా ఉంది. ఊహలు గుసగుసలాడే, లక్ష్మి రావే మా ఇంటికి, జాదుగాడులాంటి సినిమాలతో ఇప్పటికే పాపులర్ అయ్యాడు నాగశౌర్య. కానీ టీవీ9 యాజమాన్యం మాత్రం నాగశౌర్యను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. సత్యతోనే సినిమాను ప్రారంభించాలనుకుంటోంది.
First Published:  12 Sep 2015 7:00 PM GMT
Next Story