Telugu Global
Cinema & Entertainment

కిక్-2 నష్టాన్ని షేర్ తో భర్తీ చేస్తాడా..?

రవితేజ నటించిన కిక్-2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు కల్యాణ్ రామ్. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో బాగానే చేతులు కాల్చుకున్నాడు. సినిమా లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. కల్యాణ్ రామ్ కు నష్టాలు మిగిల్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా.. అందుకే కల్యాణ్ రామ్ వెంటనే తన కొత్త సినిమాను రెడీ చేశాడు. ఓవైపు కిక్-2 నిర్మాణ బాధ్యతలు చూస్తూనే మరోవైపు తను హీరోగా షేర్ అనే సినిమాను కంప్లీట్ చేశాడు […]

కిక్-2 నష్టాన్ని షేర్ తో భర్తీ చేస్తాడా..?
X
రవితేజ నటించిన కిక్-2 సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు కల్యాణ్ రామ్. సురేందర్ రెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో బాగానే చేతులు కాల్చుకున్నాడు. సినిమా లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. కల్యాణ్ రామ్ కు నష్టాలు మిగిల్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా.. అందుకే కల్యాణ్ రామ్ వెంటనే తన కొత్త సినిమాను రెడీ చేశాడు. ఓవైపు కిక్-2 నిర్మాణ బాధ్యతలు చూస్తూనే మరోవైపు తను హీరోగా షేర్ అనే సినిమాను కంప్లీట్ చేశాడు కల్యాణ్ రామ్. మల్లికార్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చేనెల రెండో వారంలో విడుదలకానున్న ఈ సినిమాతో కిక్-2 నష్టాన్ని కొంతలో కొంతయినా భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాడు కల్యాణ్ రామ్.
First Published:  12 Sep 2015 8:00 PM GMT
Next Story