Telugu Global
Cinema & Entertainment

వినాయకచవితికి కంచె పాటలు

వరుణ్ తేజ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కంచె. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ కూడా రావడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఊపులో పాటల్ని కూడా విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. కంచె సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా అదే ఫార్మాట్ ఫాలో […]

వినాయకచవితికి కంచె పాటలు
X
వరుణ్ తేజ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కంచె. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ కూడా రావడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఊపులో పాటల్ని కూడా విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. కంచె సినిమాకు సంబంధించి ప్రతి అంశాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న మేకర్స్.. ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. విశాఖలో పాటల్ని విడుదల చేయాలనుకుంటున్నారు. పైగా వినాయక చవితి రోజున ఫంక్షన్ పెట్టాలనుకుంటున్నారు. అవును.. వినాయకచవితి పర్వదినాన విశాఖ పోర్టు స్టేడియంలో కంచె ఆడియో సాంగ్స్ ను గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాఖలో జరగనున్న ఈ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారనేది ఇప్పటికే కన్ ఫర్మ్ అయింది. అయితే ఈ ఫంక్షన్ కు పవన్ వస్తాడా రాడా అనేదే అందర్లో సందేహం. నాగబాబు మాత్రం పవన్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
First Published:  13 Sep 2015 8:00 PM GMT
Next Story