Telugu Global
NEWS

పర్యాటకంలో 5 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం వివిధ కంపెనీలతో రూ. 3845 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఐదు లక్షల ఉద్యోగాల కల్పన కూడా ఉంటుందని ఆయన చెప్పారు. ఉపాధి ఎక్కువగా ఉన్న రంగం పర్యాటకమేనని, అందుకే తాము దీనిపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 160 ప్రధాన ఆలయాలున్నాయని, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి కట్టుబడి […]

పర్యాటకంలో 5 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు
X
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం వివిధ కంపెనీలతో రూ. 3845 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఐదు లక్షల ఉద్యోగాల కల్పన కూడా ఉంటుందని ఆయన చెప్పారు. ఉపాధి ఎక్కువగా ఉన్న రంగం పర్యాటకమేనని, అందుకే తాము దీనిపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 160 ప్రధాన ఆలయాలున్నాయని, టెంపుల్‌ టూరిజం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి… ఇలా చిత్తూరు నుంచి శ్రీకాకుళం సూర్యదేవాలయం వరకు ఎన్నో విశిష్ట ఆలయాలకు ఆంధ్రప్రదేశ్‌ నెలవని చంద్రబాబు అన్నారు. ఆలయాలు, మానవ వనరులు ఏపీ బలమని ఆయన విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్‌కు 900 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఈ తీరంలో ఎన్నో కమనీయ బీచ్‌లు ఉన్నాయని, రాష్ట్రానికి ఇదో ప్రత్యేక ఆకర్షణ అని ఆయన పేర్కొన్నారు.
First Published:  14 Sep 2015 1:31 AM GMT
Next Story