Telugu Global
Editor's Choice

మ‌హిళ‌ల కోసం ఓ సినీ సంఘం!

దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా మ‌హిళల‌కోసం ఓ సినీ సొసైటీ ఏర్పాటు కానున్న‌ది. కేర‌ళ‌లో లింగ‌వివ‌క్ష‌పై అవ‌గాహ‌న‌, ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తున్న కేర‌ళ స్త్రీ ప‌ద‌న‌ కేంద్రం అనే స్వ‌చ్ఛంద సంస్థ దీనికి శ్రీకారం చుట్టింది. ఇక‌పై ఈ ఫిమేల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో సినీ ఉత్సవాల‌ను నిర్వ‌హించి, మ‌హిళా ప్రాధాన్య‌త‌తో నిర్మించిన చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు… నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు… ఇంకా కీల‌క విభాగాల్లో ప‌నిచేసిన చిత్రాల‌ను ఈ ఉత్స‌వాలకు ఎంపిక చేస్తారు. దేశ‌వ్యాప్తంగా ఎన్నో సినీ […]

మ‌హిళ‌ల కోసం ఓ సినీ సంఘం!
X

దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా మ‌హిళల‌కోసం ఓ సినీ సొసైటీ ఏర్పాటు కానున్న‌ది. కేర‌ళ‌లో లింగ‌వివ‌క్ష‌పై అవ‌గాహ‌న‌, ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హిస్తున్న కేర‌ళ స్త్రీ ప‌ద‌న‌ కేంద్రం అనే స్వ‌చ్ఛంద సంస్థ దీనికి శ్రీకారం చుట్టింది. ఇక‌పై ఈ ఫిమేల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో సినీ ఉత్సవాల‌ను నిర్వ‌హించి, మ‌హిళా ప్రాధాన్య‌త‌తో నిర్మించిన చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌లు… నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు… ఇంకా కీల‌క విభాగాల్లో ప‌నిచేసిన చిత్రాల‌ను ఈ ఉత్స‌వాలకు ఎంపిక చేస్తారు.

దేశ‌వ్యాప్తంగా ఎన్నో సినీ సంఘాలు ఉన్నా ఇలా మ‌హిళ‌ల‌కోసం ప్ర‌త్యేకంగా ప‌నిచేసేది ఇంత‌కుముందు లేద‌ని ఈ స్వ‌చ్ఛంద సంస్థ నిర్వాహ‌కులు చెబుతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ జ‌రుగుతున్నా వాటిలో మ‌హిళల‌కు, వారి సినిమాల‌కు త‌గిన ప్రాధాన్య‌త‌ ఉండ‌టం లేద‌ని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప‌ద‌న‌ కేంద్రం డైర‌క్ట‌ర్ శ్రీక‌ళ‌ అన్నారు. కేవ‌లం సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మే కాకుండా మ‌హిళ‌లు ఈ రంగంలో ముంద‌డుగులు వేసేలా చ‌ర్చ‌లు, కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నామ‌ని ఆమె అన్నారు. ప్ర‌పంచ సినిమా ప‌ట్ల సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు, ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు అవ‌గాహ‌న క‌లిగించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని, అన్ని వ‌య‌సుల సాధార‌ణ ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి త‌మ సంస్థ సినీ ఉత్స‌వాల‌కు నిర్వ‌హిస్తుంద‌ని ఆమె తెలిపారు.

First Published:  14 Sep 2015 7:26 AM GMT
Next Story