Telugu Global
Others

ఒవైసీలపై మండిపడుతున్న ముస్లింలు

చదువుకుని, రాజకీయ పరిజ్ఞానం ఉన్న కొందరు ముస్లింలు ఒవైసీ సోదరులపై మండిపడుతున్నారు. ఒకవైపు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ వంటివి ముస్లిoల అస్థిత్వాన్నే దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటూ ఉంటే ఒవైసీ సోదరుల రాజకీయ ఎత్తుగడలు బిజేపీని 2019 ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో గెలిపించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఎంఐఎం మహారాష్ట్రలో నాలుగు స్థానల్లో గెలుపొందగానే, వచ్చేఎన్నికల్లో దేశమంతా ఒంటరిగానే పోటీచేస్తామని ఒవైసీ సోదరులు ప్రకటించారు. అదే జరిగితే బిజెపి  ఏమాత్రం శ్రమపడకుండా సునాయాసంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌కు బలమైన […]

ఒవైసీలపై మండిపడుతున్న ముస్లింలు
X

చదువుకుని, రాజకీయ పరిజ్ఞానం ఉన్న కొందరు ముస్లింలు ఒవైసీ సోదరులపై మండిపడుతున్నారు.

ఒకవైపు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ వంటివి ముస్లిoల అస్థిత్వాన్నే దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటూ ఉంటే ఒవైసీ సోదరుల రాజకీయ ఎత్తుగడలు బిజేపీని 2019 ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో గెలిపించేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

ఎంఐఎం మహారాష్ట్రలో నాలుగు స్థానల్లో గెలుపొందగానే, వచ్చేఎన్నికల్లో దేశమంతా ఒంటరిగానే పోటీచేస్తామని ఒవైసీ సోదరులు ప్రకటించారు. అదే జరిగితే బిజెపి ఏమాత్రం శ్రమపడకుండా సునాయాసంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్‌కు బలమైన ఓట్ బ్యాంక్‌ ముస్లింలు. వాళ్ళ ఓట్లు చీలిపోతే బిజెపిదే విజయం. మొన్నటి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూడా ఈ విషయం రుజువయింది.

బిజెపి అధికారంలోకి వచ్చినప్పటినుంచి గోవధ వంటి విషయాల్లో ముస్లింల, క్రిష్టియన్ల అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఇప్పుడు జైనుల పవిత్ర దినాలంటూ కొన్ని రాష్ట్రాల్లో మొత్తం మాంసం విక్రయాలనే నిషేధించింది. హిందూసంస్థ అజెండా అమలు ప్రారంభమయింది. ఈ పరిస్థితుల్లో ఒవైసీ సోదరుల చర్యలు బిజెపికి సహకరించేలా ఉండడం ముస్లిం మేధావులకు కోపంగా ఉంది.

తాజాగా బీహార్‌ ఎన్నికల్లో ఎంఐఎం ఒంటరిగా పోటీచేయడం వల్ల నితీష్‌ లాలూ కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తుంది. దీనికి స్పందించిన కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ కూడా ఒవైసీని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజంట్‌గా అభివర్ణించాడు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో కుదిరిన ఒప్పందం మేరకే ముస్లిం ఓట్లు చీల్చడానికి ఎంఐఎం ఒంటరిగా పోటీ చేస్తుందని దిగ్విజయ్‌ ఒవైసీపై మండిపడ్డాడు.

Read ఎంఐఎం వెన‌క బీజేపీ!

First Published:  14 Sep 2015 12:37 AM GMT
Next Story