Telugu Global
Cinema & Entertainment

నాగ్-కార్తి కొత్త సినిమా పేరు ఊపిరి

కింగ్ నాగార్జున, తమిళ స్టార్ కార్తి కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పబ్లిసిటీకి దూరంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ఫిక్స్ చేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఊపిరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గతంలో ఇదే సినిమాకు దోస్త్ లేదా మిత్రులు అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ కథాపరంగా ఊపిరి అనే పేరు సరిగ్గా సెట్టవుతుందని భావిస్తున్నారు మేకర్స్. పైగా దోస్త్, మిత్రులు లాంటి పదాల […]

నాగ్-కార్తి కొత్త సినిమా పేరు ఊపిరి
X
కింగ్ నాగార్జున, తమిళ స్టార్ కార్తి కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పబ్లిసిటీకి దూరంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పుడు టైటిల్ ఫిక్స్ చేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఊపిరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గతంలో ఇదే సినిమాకు దోస్త్ లేదా మిత్రులు అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ కథాపరంగా ఊపిరి అనే పేరు సరిగ్గా సెట్టవుతుందని భావిస్తున్నారు మేకర్స్. పైగా దోస్త్, మిత్రులు లాంటి పదాల కంటే ఊపిరి అనే పదం కాస్త స్పెషల్ గా కూడా కనిపిస్తుండడంతో ఇదే పేరును పైనలైజ్ చేశారు. సినిమాలో కార్తి సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున సరసన గాబ్రియాలా నటిస్తోంది. హాలీవుడ్ లో వచ్చిన ఇన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా ఊపిరిని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 80శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. పీవీపీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
First Published:  13 Sep 2015 7:03 PM GMT
Next Story