Telugu Global
Others

బాబు వ‌చ్చాడు..జాబులు పోతున్నాయి...

తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నిక‌ల‌కు ఓ కొత్త నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. బాబు వ‌స్తే..జాబు వ‌స్తుంది. అంటూ ఊద‌ర‌గొట్టారు. ఊరూవాడా అదిరిపోయేలా ప్ర‌చారం చేశారు. ఇది భ‌విష్య‌త్‌లో బాబు చూపించే సినిమాకు ట్యాగ్‌లైన్‌గా పనికొచ్చింది. బాబు అధికారంలోకొచ్చాడు. అయితే జాబులు రాలేదు. ఉన్న జాబులు పోయాయంటూ ఏపీ అంత‌టా ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌వుతున్నాయి. బాబు వచ్చీరాగానే తాత్కాలిక ఉద్యోగులు కొన్ని వేలమందిని ఉద్యోగం ఊడబీకి ఇంటికి పంపించాడు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉత్త‌రాంధ్ర నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కూ ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ […]

బాబు వ‌చ్చాడు..జాబులు పోతున్నాయి...
X
తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నిక‌ల‌కు ఓ కొత్త నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది. బాబు వ‌స్తే..జాబు వ‌స్తుంది. అంటూ ఊద‌ర‌గొట్టారు. ఊరూవాడా అదిరిపోయేలా ప్ర‌చారం చేశారు. ఇది భ‌విష్య‌త్‌లో బాబు చూపించే సినిమాకు ట్యాగ్‌లైన్‌గా పనికొచ్చింది. బాబు అధికారంలోకొచ్చాడు. అయితే జాబులు రాలేదు. ఉన్న జాబులు పోయాయంటూ ఏపీ అంత‌టా ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌వుతున్నాయి. బాబు వచ్చీరాగానే తాత్కాలిక ఉద్యోగులు కొన్ని వేలమందిని ఉద్యోగం ఊడబీకి ఇంటికి పంపించాడు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉత్త‌రాంధ్ర నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కూ ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ జిల్లాల్లో ప‌రిశ్ర‌మలు మూత‌ప‌డుతున్నాయి. వేలాది మంది కార్మికులు రోడ్డున‌ప‌డ్డారు. జాబొస్తుంద‌న్న బాబూ మా జాబులు పోయాయి ఆదుకోవూ అంటూ వేడుకుంటున్నారు.
లాకౌట్ల‌లో ఫ‌స్ట్ జ్యూట్‌మిల్లులు
ఉత్త‌రాంధ్ర నుంచి కోస్తాంధ్ర వ‌ర‌కూ ప్ర‌తి జిల్లాలోనూ జ్యూట్‌మిల్లులున్నాయి. ఒక్కో జ్యూట్ మిల్లులో క‌నీసం 500 నుంచి 2000 వ‌ర‌కూ కార్మికులు మూడు షిఫ్టుల్లో ప‌నిచేస్తున్నారు. అయితే జ‌న‌ప‌నార ఉత్ప‌త్తి త‌గ్గిపోవ‌డం, జ్యూట్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌కు గిరాకీ త‌గ్గ‌డం, ఉత్ప‌త్తి వ్య‌యం కూడా పెరగడంతో జ్యూట్‌మిల్లులు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతోపాటు మిల్లులు న‌డిపేకంటే..లాకౌట్ చేసి ..పెరిగిన ధ‌ర‌ల‌కు భూములు అమ్ముకుంటే ఎంతో లాభ‌మ‌నుకుంటున్న యాజ‌మాన్యాల వైఖ‌రి కూడా జ్యూట్‌మిల్ల‌ల లాకౌట్‌కు కార‌ణ‌మ‌వుతోంది. యాజ‌మాన్యాల‌తో చ‌ర్చించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన ప్ర‌భుత్వం చోద్యం చూస్తుండ‌డంతో రోజుకో జ్యూట్ మిల్లు, పూట‌కో ప‌రిశ్ర‌మ మూత‌ప‌డుతున్నాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రో్డ్డున ప‌డుతున్నారు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక తానొస్తే జాబొస్తుంద‌నే భ‌రోసా జ‌నాలు నమ్మారని, అది నిజం చేస్తామ‌ని బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌క‌టించారు. అయితే బాబువ‌చ్చాక వేలాది జాబులు పోయాయి.
లాకౌట్ లిస్టు..
విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలిలో నవ్యా, శ్రీలక్ష్మి శ్రీనివాస‌, జ్యోతి జ్యూట్‌మిల్లులు మూతప‌డ్డాయి. దీంతో 5వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ఉన్న అరుణా జ్యూట్‌మిల్లును లీజుకు తీసుకున్న శ్రీల‌క్ష్మి శ్రీనివాస యాజ‌మాన్యం దీనిని న‌డ‌ప‌లేక లాకౌట్ ప్ర‌క‌టించింది. గుంటూరులో లాభాల్లో న‌డుస్తున్న భ‌జ‌రంగ్ జ్యూట్‌మిల్లు కూడా కుంటిసాకుల‌తో లాకౌట్ ప్ర‌క‌టించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. భ‌జ‌రంగ్ మిల్లు లాకౌట్‌కు వ్య‌తిరేకంగా కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, బీజేపీ క‌లిసి పోరాడుతున్నా యాజ‌మాన్యం స్పందించ‌డంలేదు. ఇవే కాకుండా 13 జిల్లాల్లో మ‌రికొన్ని ప‌రిశ్ర‌మ‌లు మూసివేత‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నాయ‌ని స‌మాచారం.
తెలంగాణ ఉద్యోగ మేళా..ఏపీలో లాకౌట్‌ల జాత‌ర
తెలంగాణ‌లో టీపీపీఎస్సీ నోటిఫికేష‌న్‌తో వేల సంఖ్య‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ అయ్యాయి. మ‌రోవైపు హైద‌రాబాద్ కేంద్రంగా ప్రైవేట్ రంగంలో ల‌క్ష‌ల మందికి ఉపాధి అవ‌కాశాలు దొరుకుతున్నాయి. ఉపాధి క‌ల్ప‌న‌లో ముందున్న న‌గ‌రాల స‌ర‌స‌న తెలంగాణ చేరింది. అయితే కేసీఆర్ వ‌స్తే జాబొస్తుంది అనే ప్ర‌చార‌మేదీ ఇక్క‌డ సాగ‌లేదు. కానీ ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌లో తెలంగాణ ముందుకు దూసుకుపోతోంది. ఏపీలో ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. బాబొస్తే జాబొస్తుంద‌నే ప్ర‌చారం విక‌టించి..బాబొచ్చాడు..జాబులు పోయాయ‌ని మార్చుకుని కార్మికులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తున్నారు.
First Published:  14 Sep 2015 2:55 AM GMT
Next Story