Telugu Global
Cinema & Entertainment

టైటిల్ ఎగరేసుపోయిన రవి తేజ

ఆ మధ్య దిల్ రాజు తన బ్యానర్ పై ఒకేసారి 3 టైటిల్స్ రిజిస్టర్ చేయించాడు. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దిల్ రాజు త్వరలోనే సినిమా చేయబోతున్నాడనే వార్తల మధ్య టైటిల్స్ రిజిస్ట్రేషన్ జరగడంతో అంతా పవన్ సినిమాతో ఆ టైటిల్స్ ను ముడిపెట్టారు. అయితే తాజాగా ఆ 3 టైటిల్స్ లో ఒక టైటిల్ ను రవితేజ ఎగరేసుకుపోయాడు. జనగనమన, సుప్రీం, ఎవడో […]

టైటిల్ ఎగరేసుపోయిన రవి తేజ
X
ఆ మధ్య దిల్ రాజు తన బ్యానర్ పై ఒకేసారి 3 టైటిల్స్ రిజిస్టర్ చేయించాడు. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దిల్ రాజు త్వరలోనే సినిమా చేయబోతున్నాడనే వార్తల మధ్య టైటిల్స్ రిజిస్ట్రేషన్ జరగడంతో అంతా పవన్ సినిమాతో ఆ టైటిల్స్ ను ముడిపెట్టారు. అయితే తాజాగా ఆ 3 టైటిల్స్ లో ఒక టైటిల్ ను రవితేజ ఎగరేసుకుపోయాడు. జనగనమన, సుప్రీం, ఎవడో ఒకడు అనే టైటిల్స్ ను దిల్ రాజు రిజిస్టర్ చేయించాడు. వీటిలో ఎవడో ఒకడు అనే టైటిల్ ను మాస్ రాజాకు కేటాయించారు. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. గతంలో ఓ మై ఫ్రెండ్ అనే సినిమా చేసిన వేణు శ్రీరాం.. ఎవడో ఒకడు టైటిల్ తో రవితేజ హీరోగా మరో సినిమా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం రవితేజ, సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ లో ఎవడో ఒకడు సినిమా సెట్స్ పైకి వస్తుంది.
First Published:  13 Sep 2015 8:06 PM GMT
Next Story