Telugu Global
NEWS

ల్యాండ్‌ బ్యాంక్‌ విధానానికి స్వస్తి చెప్పండి: సీపీఎం

పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చని పంటపోలాలను రైతుల నుంచి బలవంతంగా లాగేసుకోవడాన్ని సీపీఎం తప్పు పట్టింది. సారవంతమైన వ్యవసాయ భూములను బడా కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయడం సరికాదని, ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా సెకరించడాన్ని ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడం సరికాదని, ఈ విధానానికి […]

ల్యాండ్‌ బ్యాంక్‌ విధానానికి స్వస్తి చెప్పండి: సీపీఎం
X
పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చని పంటపోలాలను రైతుల నుంచి బలవంతంగా లాగేసుకోవడాన్ని సీపీఎం తప్పు పట్టింది. సారవంతమైన వ్యవసాయ భూములను బడా కార్పొరేట్‌ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేయడం సరికాదని, ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా సెకరించడాన్ని ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించడం సరికాదని, ఈ విధానానికి స్వస్తి చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పేరుతో అవసరానికి మించి పెద్ద మొత్తంలో రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని విరమించుకోవాలని కోరారు. దీనివల్ల వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని తెలిపారు.
First Published:  14 Sep 2015 12:53 AM GMT
Next Story